ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టులో మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం.. చెన్నైతో నేటి మ్యాచ్ డౌటే

Delhi Capitals Net Bowler Tests Positive For COVID-19 Ahead Of CSK Match.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2022 9:53 AM GMT
ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టులో మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం.. చెన్నైతో నేటి మ్యాచ్ డౌటే

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టును క‌రోనా వ‌ద‌ల‌నంటోంది. సీజ‌న్ ఆరంభంలో ప‌లువురు ఆట‌గాళ్ల‌తో పాటు స‌పోర్టింగ్ స్టాఫ్ వైర‌స్ బారిన ప‌డ‌గా.. ఇప్పుడు మ‌రొక‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. రెగ్యుల‌ర్ క‌రోనా టెస్టుల్లో భాగంగా ఆట‌గాళ్లంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. ఢిల్లీ నెట్ బౌల‌ర్‌కి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆట‌గాళ్లంద‌రూ ప్ర‌స్తుతం హోట‌ల్ రూమ్‌లో ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు. ఈ నేప‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో నేడు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆడాల్సిన మ్యాచ్ సందిగ్థంలో ప‌డింది.

ఢిల్లీ ఆట‌గాళ్లంద‌రికీ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. రెండోసారి చేసిన ఫలితాలు వచ్చిన తర్వాతే నేడు రాత్రి చెన్నైతో మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనేది తెలియ‌నుంది. 'రెగ్యులర్‌ కరోనా టెస్టుల్లో భాగంగా ఈరోజు ఉదయం చేసిన పరీక్షలో ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ బౌలర్ పాజిటివ్‌గా తేలాడు. అతడిని ఐసోలేషన్‌లోకి పంపాము. ఆటగాళ్లను హోటల్‌ రూమ్‌లోనే ఉండమని ఆదేశించాం' అని ఐపీఎల్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

ఇక సీజ‌న్‌లో ఢిల్లీ ప్ర‌యాణం ప‌డుతూ లేస్తూ కొన‌సాగుతోంది. ఓ మ్యాచ్‌లో విజ‌యం మ‌రో మ్యాచ్‌లో ఓట‌మిగా ఉంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 10 మ్యాచులు ఆడిన ఢిల్లీ 5 విజ‌యాలు సాధించ‌గా.. మ‌రో 5 మ్యాచుల్లో ఓట‌మి పాలైంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక ఫ్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇక నుంచి ఢిల్లీ ఆడాల్సిన ప్ర‌తీ మ్యాచులో త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితి ఉంది. మరోవైపు చెన్నై సూప‌ర్ కింగ్స్‌ మాత్రం 10 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు.. ఏడు ఓటములతో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది. దీంతో చెన్నై జ‌ట్టుకు ప్లే ఆప్స్‌కు చేర‌డం దాదాపుగా అసాధ్యం.

Next Story
Share it