సంజూ శాంసన్‌ ఒంట‌రి పోరాటం.. రాజస్థాన్ ఘోర ప‌రాజ‌యం

Delhi Capitals Beat Rajastan Royals. ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మ‌ధ్య‌ అబుదాబి వేదికగా శ‌నివారం జ‌రిగిన‌

By Medi Samrat  Published on  25 Sept 2021 7:45 PM IST
సంజూ శాంసన్‌ ఒంట‌రి పోరాటం.. రాజస్థాన్ ఘోర ప‌రాజ‌యం

ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మ‌ధ్య‌ అబుదాబి వేదికగా శ‌నివారం జ‌రిగిన‌ మొద‌టి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 33 పరుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ల‌లో శ్రేయస్‌ అయ్యర్(43), హెట్‌మైర్‌(28) ప‌ర్వాలేద‌నిపించారు. రాజస్థాన్ బౌల‌ర్ల‌లో ముస్తాపిజుర్ రెండు, చేత‌న్ స‌కారియా రెండు, కార్తీక్ త్యాగి, రాహుల్ తేవాటియా చేరో వికెట్ చొప్పున ప‌డ‌గొట్టారు.

అనంత‌రం 156 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ ఆటగాళ్లలో కెప్టెన్‌ సంజూ శాంసన్‌(70; 53 బంతుల్లో 8×4, 1×6) ఒక్కడే రాణించగా.. మహిపాల్‌ లోమ్రోర్‌(19) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరునూ చేయలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జె రెండు, అవేశ్‌ఖాన్‌, రవిచంద్రన్ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, రబాడ‌ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజ‌యంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక ఆ జ‌ట్టు దాదాపుగా ప్లేఆఫ్స్‌కి చేరుకుంది.


Next Story