చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ
47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆదివారం అంటే నవంబర్ 2, 2025న భారత మహిళా క్రికెట్ జట్టు చేతుల్లోకి ప్రపంచకప్ ట్రోఫీ వచ్చింది.
By - Medi Samrat |
47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆదివారం అంటే నవంబర్ 2, 2025న భారత మహిళా క్రికెట్ జట్టు చేతుల్లోకి ప్రపంచకప్ ట్రోఫీ వచ్చింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌ను తొలిసారిగా గెలుచుకుంది. స్టార్ మహిళా ఆల్ రౌండర్ దీప్తీ శర్మ భారత్ ప్రపంచ కప్ గెలవడంలో దోహదపడింది. మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇది మాత్రమే కాదు.. ఇప్పటి వరకూ మగ, ఆడ అనే తేడా లేకుండా మరే ఇతర క్రికెటర్ సాధించలేని రికార్డును కూడా దీప్తి నమోదు చేసింది.
దీప్తి శర్మ ప్రపంచ కప్ ఎడిషన్‌లో 200 పరుగులు, 20 వికెట్లు తీసిన మొదటి క్రికెటర్ అయ్యింది. ఈ ప్రపంచ కప్‌లో దీప్తి శర్మ 9 మ్యాచ్‌లలో 215 పరుగులు చేసింది. సగటు 30, స్ట్రైక్ రేట్ 90. మొత్తం మూడు అర్ధ సెంచరీలు చేసింది. అలాగే ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఘనత సాధించింది. దీప్తి ఫైనల్‌లో 5/39తో తన అత్యుత్తమ బౌలింగ్‌తో మొత్తం 22 వికెట్లు పడగొట్టింది.
అలాగే.. ప్రపంచ కప్ ఫైనల్‌లో ఐదు వికెట్లు తీసిన మొదటి భారతీయ క్రికెటర్‌గా కూడా అవతరించింది. ప్రపంచ కప్ ఒకే ఎడిషన్‌లో భారతీయురాలిగా అత్యధిక వికెట్లు తీసిన రికార్డును కూడా ఆమె సొంతం చేసుకుంది. ఒకే ఎడిషన్‌లో 20 వికెట్లు తీసిన శుభాంగి కులకర్ణి, నీతూ డేవిడ్‌ల రికార్డును ఆమె అధిగమించింది.
భారత మహిళా జట్టుకు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది?
పురుషుల కంటే భారత మహిళల జట్టుకే ఎక్కువ ప్రైజ్ మనీ లభించింది..
భారత మహిళల జట్టు రూ.40 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది..
రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు రూ.19.77 కోట్లు లభించాయి..
సెమీ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు రూ.9.89 కోట్లు వచ్చాయి.
2023 వన్డే ప్రపంచకప్‌లో ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టుకు రూ.35.27 కోట్లు లభించాయి