ఒలింపిక్స్‌.. ఆర్చరీ క్వార్టర్ ఫైనల్‌లో ఓడిన దీపికా కుమారి

భారత వెటరన్ ఆర్చర్ దీపికా కుమారి ఎలాంటి అద్భుతం చేయలేకపోయింది.

By Medi Samrat  Published on  3 Aug 2024 8:18 PM IST
ఒలింపిక్స్‌.. ఆర్చరీ క్వార్టర్ ఫైనల్‌లో ఓడిన దీపికా కుమారి

భారత వెటరన్ ఆర్చర్ దీపికా కుమారి ఎలాంటి అద్భుతం చేయలేకపోయింది. శనివారం కొరియాకు చెందిన నామ్ సుహ్యోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-4 తేడాతో ఓడిపోయింది. ఆరంభంలో దీపిక బాగానే ఆడినా ఆ తర్వాత పుంజుకోలేకపోయింది. దీపికా కీలక దశల్లో 6, 7 స్కోరు చేయడం.. ఆమె ఫలితాలను ప్రభావితం చేసింది. దీపిక ఓటమితో భారతదేశం ఆర్చరీ విభాగంలో పారిస్ నుండి ఖాళీ చేతులతో తిరిగి రానుంది. భారత ఆర్చరీ బృందం భారీ అంచనాలతో ఒలింపిక్స్ లో బరిలోకి దిగింది, కానీ ఏ పతకాన్ని కూడా సాధించలేకపోయింది.

దీపిక రౌండ్ 16లో భాగంగా జ‌ర్మ‌నీ ప్లేయ‌ర్ మిచెల్లె క్రోపెన్ పై 6-4 తేడాతో నెగ్గింది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్లో సుహ్యెన్ నామ్ చేతిలో ఓటమిని మూటగట్టుకుంది. ఎంతో అనుభవం ఉన్న దీపిక మరోసారి ఒత్తిడిని అధిగమించలేకపోయింది.

Next Story