నెల రోజులుగా అలరిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 గ్రాండ్ ఫైనల్ ముంబై ఇండియన్స్(MI), ఢిల్లీ క్యాపిటల్స్(DC) మధ్య శనివారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగనుంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్‌ను కైవసం చేసుకోలేదు కానీ.. మూడు సీజన్లలో నేరుగా ఫైనల్స్‌కు చేరుకున్న ఏకైక జట్టుగా అరుదైన రికార్డును చేజిక్కించుకుంది.
2023లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యే ముందు ఆస్ట్రేలియాకు ఎన్నో విజయాలు అందించిన మెగ్ లానింగ్ క్యాపిటల్స్‌కు టైటిల్ అందించే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. 2023లో ఈ మైదానంలోనే ఢిల్లీని ఓడించి ముంబై తొలి టైటిల్ గెలుచుకుంది. గత ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది.
ముంబై అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈసారి కూడా టైటిల్ కోసం గట్టిగానే పోరాడాల్సి ఉంటుంది. గత వారం రోజులుగా ముంబై జట్టు నాలుగో మ్యాచ్ ఆడి ఫామ్‌లో ఉంది. DCకి ఎనిమిది రోజుల విరామం లభించింది.. అది వారికి అనుకూలంగా పని చేయవచ్చు లేదా పని చేయకపోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
MI W వర్సెస్ DC W మధ్య WPL 2025 ఫైనల్ 7:30 PM ISTకి ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటలకు టాస్ జరుగుతుంది. అంతకు ముందు ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అలాగే JioHotstar యాప్‌లో కూడా స్ట్రీమింగ్ ఉంటుంది.