ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అంటే ఎవరూ ఊహించని సక్సెస్ లను అందుకున్న టీమ్. అయితే గత మూడు సీజన్లుగా ముంబై ఇండియన్స్ మునుపటి ఫామ్ ను అందుకోడానికి చాలా కష్టపడుతూ ఉంది. ఈ ఏడాది కూడా ముంబై ఇండియన్స్ గొప్పగా ఆడడం లేదు. 7 మ్యాచ్ లలో 3 మాత్రమే గెలిచింది. మిగిలిన 7 గేమ్ లలో అద్భుతంగా రాణిస్తేనే ప్లే ఆఫ్స్ కు వెళ్లగలదు.
ఈ ఏడాది రోహిత్ శర్మ బ్యాటింగ్ లో నిలకడను కనబరచడం లేదు. రోహిత్ శర్మ రాణించకపోతే టైటిల్ కు ముంబై ఇండియన్స్ మరోసారి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ బ్యాటింగ్ సామర్థ్యంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ గొప్ప ప్రదర్శన ఇవ్వలేకపొతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్, ఆసీస్ లెజెండ్ షేన్ వాట్సన్ కూడా ఐపీఎల్‌లో రోహిత్ గొప్పగా ఆడడం లేదని అంటున్నాడు. భారత క్రికెటర్లు ఏడాది పొడవునా నాన్‌స్టాప్‌గా క్రికెట్ ఆడతారు. రోహిత్ శర్మ ఇప్పుడు భారత కెప్టెన్‌గా కూడా ఉంటున్నాడు. అతను కాస్త మానసికంగా అలసిపోతున్నాడేమోననే విషయాన్ని మనం చూడాలి. రోహిత్ శర్మ విషయానికి వస్తే, మనం అతని అత్యుత్తమ ప్రదర్శనను చూశాము, కానీ గత నాలుగు లేదా ఐదు సంవత్సరాల IPLలో అతను గొప్పగా ఆడలేదని వాట్సన్ చెప్పుకొచ్చాడు.