మాక్స్‌వెల్‌పై కొత్త కామెంట్ చేసిన డేవిడ్‌ వార్నర్‌..!

David Warner's hilarious dig at Glenn Maxwell's IPL 2021 price. గత ఐపిఎల్ సీజన్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్

By Medi Samrat  Published on  23 Feb 2021 3:18 PM IST
David Warners hilarious dig at Glenn Maxwells IPL 2021 price.

గత ఐపిఎల్ సీజన్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ ఘోరంగా విఫలమయ్యాడు. అందుకు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నుంచి విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. గత సీజన్ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మాక్స్ వెల్ ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. పేలవమైన ప్రదర్శనే కనబరిచాడు. ఓ ఫ్రాంఛైజీ వదులుకున్న మాక్స్‌వెల్‌ను మరో ఫ్రాంఛైజీ భారీ ధరకు దక్కించుకోవడం ఆశ్చర్యంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు.

పంజాబ్‌ వదులుకున్న మాక్స్‌వెల్‌ను ఐపీఎల్‌ వేలంలో బెంగుళూరు రూ.14.25 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఆస్ట్రేలియా×న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు కామెంటర్‌గా వెళ్లిన వార్నర్‌.. మాక్సీ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఇలా సరదాగా మాట్లాడాడు.

దీనికి మరో వ్యాఖ్యాత మార్క్‌ వా స్పందిస్తూ.. "గత ఐపీఎల్‌ సీజన్‌ ప్రదర్శన ఆధారంగా తీసుకున్నారనుకుంటా" అని సరదాగా బదులిచ్చాడు. 2020 ఐపీఎల్‌లో మాక్సీ ఘోరంగా విఫలమయ్యాడు. పంజాబ్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడిన అతడు 15 సగటుతో 108 పరుగులే చేశాడు. అంతేగాక అతడు ఒక్క సిక్సర్‌ కూడా సాధించకపోవడం గమనార్హం. సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మాక్స్‌వెల్‌ ఒక పరుగుకే వెనుదిరిగాడు.


Next Story