టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐదో టెస్టు మ్యాచ్ రద్దు కావడానికి విరాట్ కోహ్లీనే కారణమన్నాడు. మ్యాచ్‌కు ముందు రోజు అర్థరాత్రి కోహ్లీ బీసీసీఐకి లేఖలు రాసి మ్యాచ్ రద్దు అయ్యేలా చేశాడని ఆరోపించాడు. ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇతడు చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
కరోనా వస్తుందని ఎవరూ తెలుసుకోలేకపోయారా ఏంటీ? అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ఒక్క ఐదో మ్యాచ్ ను మాత్రమే ఎందుకు రద్దు చేసినట్టంటూ అతడు నిలదీశాడు. కరోనా భయం అని అనుకుంటే మిగతా మ్యాచ్ లనూ రద్దు చేయాల్సిందన్నాడు. ఆటగాళ్లందరికీ నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందన్న విసయాన్ని కోహ్లీ మర్చిపోయాడన్నారు. కేవలం ఐపీఎల్‌ను దృష్టిలో ఉంచుకుని కోహ్లీ ..ఐదో టెస్టు ఆరంభానికి ముందు అర్ధరాత్రి బీసీసీఐకి లేఖలు రాశాడని, అందుకే మ్యాచ్ లను బీసీసీఐ రద్దు చేసిందని ఆరోపించాడు. ఒకవేళ ఐపీఎల్ కోసమే ఈ మ్యాచ్ ను రద్దు చేసి ఉంటే మాత్రం అది తీవ్రమైన చర్యేనని అతడు అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు, ఐదో టెస్టుకు ఖచ్చితంగా సంబంధం ఉందని ఆరోపించాడు. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.