ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ భారత్ పొరుగు దేశం పాకిస్థాన్‌లో జరుగుతోంది. ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు జరిగిన ఈ టోర్నీలో విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ టోర్నమెంట్‌లో జరిగే చిత్రవిచిత్రమైన సంఘటనలు.. ఆట కంటే ఎక్కువ మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ఈ లీగ్‌లో ఆటగాళ్లు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం, కొన్నిసార్లు మహిళా వ్యాఖ్యాతలతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యాఖ్యాత క్రికెటర్ భార్యను ఎత్తుకుని తిప్పిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
క్వెట్టా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెటర్ బెన్ కట్టింగ్ భార్య ఎరిన్ హాలండ్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మారిసన్ తమ వ్యాఖ్యానాలతో ప్రేక్షకులను అలరించారు. ఇంతలో డానీ మోరిసన్ అకస్మాత్తుగా ఎరిన్ హాలండ్ వద్దకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆమెను ఎత్తుకున్నాడు. అంతేకాదు.. డానీ ఆమెను ఎత్తుకుని బొంగరం తిరిగినట్టు తిరిగాడు. డానీ చర్యలు ఒక్కసారిగా అందరినీ షాక్‌కి గురిచేస్తాయి. ఎరిన్ హాలండ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకున్నారు. అంకుల్ అంటూ మోరిసన్‌ని సంబోదించింది. గతంలో డానీ మారిసన్ ఐపీఎల్‌లో కూడా ఇలాగే చేశాడు. ఛీర్‌లీడర్‌ను ఎత్తుకుని వెళ్లడం కూడా చాలా వివాదమైంది.