కామన్వెల్త్‌ గేమ్స్‌లో నిఖత్‌ జరీన్‌కు స్వర్ణం

CWG -2022 Nikhat zareen wins Gold in womens boxing. మహిళల ప్రపంచ ఛాంపియన్‌ బాక్సర్‌, తెలంగాణ తేజం నిఖత్‌ జరీన్‌ తన సత్తా ఏంటో మరోసారి రుజువు చేసింది.

By అంజి  Published on  7 Aug 2022 4:16 PM GMT
కామన్వెల్త్‌ గేమ్స్‌లో నిఖత్‌ జరీన్‌కు స్వర్ణం

మహిళల ప్రపంచ ఛాంపియన్‌ బాక్సర్‌, తెలంగాణ తేజం నిఖత్‌ జరీన్‌ తన సత్తా ఏంటో మరోసారి రుజువు చేసింది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌ - 2022లో పసిడి పతకం గెల్చుకుంది. ఈ టోర్నీలో 48 - 50 కిలోల ఫ్లైవెయిట్‌ కేటగిరీలో పోటీ పడిన నిఖత్.. ఫైనల్‌లో ఐర్లాండ్‌కు చెందిన బాక్సర్‌ కార్లీ మెక్‌నాల్‌పై గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో కార్లీపై నిఖత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

5-0 తేడాతో నిఖత్‌ విజయం సాధించింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ తప్ప మిగతా అన్ని మ్యాచుల్లోనూ నిఖత్ ఇదే స్కోరుతో గెలిచింది. ఆ ఒక్క మ్యాచ్‌ను అంపైర్ మరో రెండున్నర నిమిషాలు ఉండగా.. ఆపేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. కామన్వెల్త్‌ క్రీడల్లో నిఖత్‌ జరీన్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. బాక్సర్‌ నిఖత్‌కు అభినందనలు తెలిపారు. నిఖత్‌ జరీన్‌ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవాప్తమైందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి, రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిఖత్‌ జరీన్‌ శుభాకాంక్షలు తెలిపారు.




Next Story