కామన్‌వెల్త్ క్రీడల్లో యాక్సిడెంట్.. భారత సైక్లిస్ట్‌కు తీవ్రగాయాలు

CWG -2022 indian cyclist faces horror crash left on stretcher. ఇంగ్లండ్‌లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ హోరా హోరీగా సాగుతున్నాయి. గేమ్స్‌లో భాగంగా జరిగిన సైక్లిస్ట్‌ స్క్రాచ్‌ రేసులో ప్రమాదం జరిగింది.

By అంజి  Published on  2 Aug 2022 8:15 AM GMT
కామన్‌వెల్త్ క్రీడల్లో యాక్సిడెంట్.. భారత సైక్లిస్ట్‌కు తీవ్రగాయాలు

ఇంగ్లండ్‌లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ హోరా హోరీగా సాగుతున్నాయి. గేమ్స్‌లో భాగంగా జరిగిన సైక్లిస్ట్‌ స్క్రాచ్‌ రేసులో ప్రమాదం జరిగింది. మహిళల 10 కిలోమీటర్ల స్క్రాచ్‌ రేసులో భారత సైక్లిస్ట్‌ మీనాక్షికి ప్రమాదం జరిగింది. రేసు జరుగుతుండగా మధ్యలో సైకిల్ అదుపుతప్పడంతో మీనాక్షి కిందపడిపోయింది. అదే సమయంలో ఆమె వెనుకే వస్తున్న న్యూజిలాండ్ సైక్లిస్ట్‌ బ్రయానీ బోథా.. కిందపడి ఉన్న మీనాక్షిని తప్పించలేపోయింది. ఈ క్రమంలోనే మీనాక్షిని తొక్కుకుంటూ వెళ్లి బోథా కిందపడిపోయింది. ఈ భయంకరమైన దృశ్యాన్ని మెడిక్స్‌ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.

మొదటగా మీనాక్షి, బోథా ఇద్దరికీ ఫస్ట్‌ ఎయిడ్‌ అందించారు. ఆ తర్వాత ప్రమాదానికి గురైన ఇద్దరు సైక్లిస్టులను రేసు నుంచి పక్కకు తీసుకొచ్చేశారు. ఈ క్రమంలో మీనాక్షికి తీవ్రమైన గాయం కావడంతో ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. ఇటీవలే పురుషుల సైక్లింగ్‌ ఈవెంట్‌లో కూడా ఇలాగే భయంకరమైన ప్రమాదం జరిగింది. సైక్లిస్ట్ తన వేగాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఈ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నంలో బారియర్స్ వైపు దూసుకెళ్లాడు. ప్రేక్షకుల వైపు దూసుకెళ్లడంతో.. అక్కడ ఉన్న ఓ ప్రేక్షకుడికి తీవ్రంగా గాయమైంది. సైక్లిస్ట్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి.


Next Story
Share it