ఇద్దరికి ఐదోదే.. ఇటు గెలుపు.. అటు ఓట‌మి

CSK defeated SRH. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్లు విజృంభించ‌డంతో 172 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉఫ్ మ‌నీ ఊదేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2021 2:27 AM GMT
CSK defeated SRH

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(2021) సీజ‌న్‌లో ధోని సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ దూసుకెలుతోంది. ఢిల్లీ వేదిక‌గా.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్లు విజృంభించ‌డంతో 172 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉఫ్ మ‌నీ ఊదేసింది. దీంతో పాయింట్ల పట్టిక‌లో ధోనిసేన ఐదో విజ‌యాన్ని న‌మోదు చేసి అగ్ర‌స్థానంలో నిలువ‌గా.. రైజ‌ర్స్ ఐదో ప‌రాజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో నిలిచింది. ఈ ఓట‌మితో స‌న్ రైజ‌ర్స్ ఫ్లే ఆప్స్ అవ‌కాశాలు క్లిష్టం అవుతున్నాయి.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. మ‌నీష్ పాండే (61; 46 బంతుల్లో 5 పోర్లు, 1 సిక్స్‌), వార్న‌ర్ (57; 55 బంతుల్లో 3 పోర్లు, 2 సిక్స‌ర్లు), విలియ‌మ్స‌న్ (26; నాటౌట్ 10 బంతుల్లో 4 పోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంత‌రం172 లక్ష్యంతో వచ్చిన చెన్నైకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (75; 44 బంతుల్లో 12 పోర్లు), ఫాఫ్ డు ప్లెసిస్(56; 38 బంతుల్లో 6పోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీలు పూర్తి చేసి తొలి వికెట్ కు 129 పరుగుల భారీ భాగసౌమ్యని నెలకొల్పారు. అయితే.. 13 ఓవర్లో గైక్వాడ్ ను వెన్నకి పంపిన రషీద్ ఖాన్ ఆ తర్వాత 15 ఓవర్లో వరుసగా మొయిన్ అలీ, డుప్లెసిస్ ను ఔట్ చేసి చెన్నైని కొంత‌ కంగారు పెట్టాడు. అయితే అప్పటికే విజయానికి చేరువైన జట్టును రైనా(17 నాటౌట్‌), జడేజా(7 నాటౌట్‌) కలిసి చెన్నైకు మ‌రో విజ‌యాన్ని అందించారు.


Next Story