ధోనీ తీసుకున్న నిర్ణయమే.. కెప్టెన్ మార్పుపై సీఎస్కే కోచ్..!
IPL 17వ సీజన్ ప్రారంభానికి ముందు మహేంద్ర సింగ్ ధోనీ CSK కెప్టెన్సీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.
By Medi Samrat Published on 22 March 2024 4:16 PM ISTIPL 17వ సీజన్ ప్రారంభానికి ముందు మహేంద్ర సింగ్ ధోనీ CSK కెప్టెన్సీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. మహి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను సీఎస్‌కే కెప్టెన్‌గా నియమించారు. ఈ నిర్ణయం అభిమానుల హృదయాలను బద్దలు కొట్టింది. ధోనీ CSK జట్టు కెప్టెన్సీ నుండి తప్పుకున్న తర్వాత.. చాలా మంది అనుభవజ్ఞులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వాటిపై CSK కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా స్పందిస్తున్నారు. వాస్తవానికి IPL 2022లో MS ధోని CSK కెప్టెన్సీని విడిచిపెట్టాడు. దీంతో రవీంద్ర జడేజా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కానీ జడేజా కెప్టెన్‌గా ప్రభావం చూపడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత ధోనీ మళ్లీ కెప్టెన్సీ తీసుకున్నాడు.
ఈసారి IPL 2024 కంటే ముందు ధోనీ CSK కెప్టెన్సీ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. CSK కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ దీనిపై మాట్లాడుతూ.. రుతురాజ్ గైక్వాడ్ CSK జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొన్నారు. నిజాయితీగా చెప్పాలంటే ఈ సమయంలో ధోనీ కెప్టెన్సీని విడిచిపెట్టడానికి మేనేజ్‌మెంట్ సిద్ధంగా లేదని చెప్పాడు. ఈ సంవత్సరం మేము మా నాయకత్వ ప్రణాళికను చాలా గట్టిగా ప్లాన్ చేసాము. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోచ్ తెలిపాడు. గత ఏడాది మేం ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నాం. కెప్టెన్సీని వేరొకరికి అప్పగించడానికి ఇదే సరైన సమయమని అతను భావించాడని తెలిపాడు.