పుజారాను సొంతం చేసుకున్న‌ చెన్నై.. చ‌ప్ప‌ట్ల‌తో అభినంద‌న.. భ‌జ్జీకి మొండిచేయి

CSK buys Cheteshwar Pujara for Rs 50 lakhs.టీమ్ఇండియా టెస్ట్ స్పెష‌లిస్ట్ ఛ‌తేశ్వ‌ర్ ను చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్రాంచైజీ సొంతం చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2021 1:12 PM GMT
CSK buys Cheteshwar Pujara for Rs 50 lakhs.

టీమ్ఇండియా టెస్ట్ స్పెష‌లిస్ట్ ఛ‌తేశ్వ‌ర్ ను చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్రాంచైజీ సొంతం చేసుకుంది. బేస్ ధర రూ.50 లక్షలుగా వేలంలో నిలిచిన పుజారా అదే ధర వద్ద చెన్నై సొంతం చేసుకుంది. చెన్నై పుజారాను ద‌క్కించుకున్నాక ఫ్రాంచైజీల‌న్ని అభినంద‌పూర్వ‌కంగా చ‌ప్ప‌ట్లు కొట్టాయి. పుజారా 2014లో చివరిగా పంజాబ్ తరపున ఐపీఎల్ ఆడాడు. ఆ తరువాత ప్రతి వేలంలోనూ ఎవరూ కొనుగోలు చేయలేదు. పుజారా తన కెరీర్‌లో మొత్తం 30 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 390 ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక స్కోరు 51.


ద‌క్షిణాఫ్రికా ఆల్‌రౌండ‌ర్ క్రిస్ మోరిస్ కోసం జ‌ట్లు విప‌రీతంగా పోటి ప‌డ్డాయి. చివ‌రికి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అత‌డిని రూ.16.26 కోట్ల‌కు ద‌క్కించుకుంది. చివ‌రి వ‌ర‌కు అత‌డి కోసం పంజాబ్ కింగ్స్ పోటి ప‌డింది. తొలుత బెంగ‌ళూరు ధ‌ర పెంచుతూ పోగా.. రూ.5కోట్లు దాట‌గానే ముంబై రంగంలోకి దిగింది. రూ.12కోట్లు దాట‌గానే రాజ‌స్థాన్ బ‌రిలోకి వ‌చ్చింది. పంజాబ్‌, రాజ‌స్థాన్ చివ‌రి వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్లుగా పోటిప‌డ‌గా.. చివ‌ర‌గా రాజ‌స్థాన్ మోరీస్ ను సొంతం చేసుకుంది.

మొయిన్ అలీకి రూ.7కోట్లతో చెన్నై సొంతం చేసుకోగా.. శివ‌మ్‌దూబేను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ.4.4కోట్ల‌కు ద‌క్కించుకుంది. టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్‌గా ఉన్న డేవిడ్ మ‌ల‌న్‌ను రూ.1.5కోట్ల‌కే పంజాబ్ కింగ్స్ సునాయాసంగా ద‌క్కించుకుంది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పేస‌ర్ జే రిచ‌ర్డ్ స‌న్ కాసుల

పంట పండించాడు. పంజాబ్ కింగ్స్ అత‌డిని రూ.14కోట్ల‌కు ద‌క్కించుకుంది. కౌల్ట‌న్ నైల్‌కు రూ.5కోట్ల‌కు ముంబై, ఉమేశ్ యాద‌వ్ ను కోటికి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, పియూష్ చావ్లాను రూ.2.4 కోట్ల‌కు ముంబై జ‌ట్లు సొంతం చేసుకున్నాయి.

ఇక గ‌తేడాది రూ.8.5కోట్లు ప‌లికిన షెల్డ‌న్ కాట్రెల్‌కు ఈ సారి మొండిచేయి ఎదురైంది. ఇంగ్లాండ్ స్పిన్న‌ర్ ఆదిల్ ర‌షీద్‌, ఆఫ్ఘ‌నిస్థాన్ స్పిన్న‌ర్ ముజీబ్‌ను, కివీస్ స్పిన్న‌ర్ ఇష్ సోదీని ఎవ‌రూ తీసుకోలేదు. ఇక టీమ్ఇండియా వెట‌ర‌న్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ను కొనుగోలు చేసేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు.


Next Story