మొక్కు చెల్లించుకున్న టీమిండియా క్రికెటర్
Cricketer T Natarajan visits Palani temple, gets his head tonsured. ఐపీఎల్‌లో అదరగొట్టి టీమిండియా ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ నటరాజన్ శనివారం పళని ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు.
By Medi Samrat Published on
31 Jan 2021 4:39 AM GMT

ఐపీఎల్‌లో అదరగొట్టి టీమిండియా ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ నటరాజన్ శనివారం పళని ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. దిండుగల్ జిల్లా పళనిలోని సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని.. తలనీలాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చి నటరాజన్‌తో సెల్ఫీలు దిగారు.
తమిళనాడుకు చెందిన నటరాజన్ ఆస్ట్రేలియా పర్యటనతోనే వన్డే, టెస్టు, టీ20లలో టీమిండియా ఎంట్రీ ఇచ్చాడు. ఆరంగ్రేటంలోనే తొమ్మది వికెట్లు తీసి రాణించాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని సేలంలోని స్వగ్రామానికి చేరుకున్న నటరాజన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఆ స్వాగత కార్యక్రమం దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి.
Next Story