మళ్లీ పెళ్లి చేసుకుంటున్న హార్ధిక్ పాండ్యా

Cricketer Hardik Pandya Is Getting Married Again. టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు.

By M.S.R  Published on  13 Feb 2023 8:15 PM IST
మళ్లీ పెళ్లి చేసుకుంటున్న హార్ధిక్ పాండ్యా

టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు. సోమవారం నుంచి మూడు రోజుల‌పాటు పెళ్లి వేడుకలు అంగరంగవైభంగా జరగనున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ పెళ్లి వేడుక ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు.

క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్యను మరోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ ను హార్దిక్ పాండ్యా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలాకాలంగా ప్రేమలో ఉన్న హార్దిక్ పాండ్యా, నటాషా కరోనా లాక్ డౌన్ సమయంలో రిజిస్టర్ మ్యారేజి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకోవాలని హార్దిక్, నటాషా నిర్ణయించుకున్నారు. నేటి నుంచి 16వ తేదీ వరకు వీరి పెళ్లి వేడుకలు జరగనున్నాయి. హల్దీ, మెహెందీ, సంగీత్ వేడుకలతో తమ పెళ్లిని వైభవంగా జరుపుకోవాలని హార్దిక్ కోరుకుంటున్నాడు.

2020 మే 31న కోర్టు వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. జూలై 2020లో వీరికి బాబు జన్మించాడు. తాజాగా వీరు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.


Next Story