T20 World Cup: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్
టీ20 వరల్డ్ కప్ టోర్నీ నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కీలక ప్రకటన చేసింది.
By Srikanth Gundamalla
T20 World Cup: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్
క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. మార్చిలోనే ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీ మ్యాచ్‌లను ఫ్రీగా వీక్షించేదుకు అవకాశం కల్పిస్తోంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 29వ తేదీ వరకు సాగనున్న ఈ ఈవెంట్‌లో మొత్తం 55 టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.
టీ20 వరల్డ్ కప్ టోర్నీ నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కీలక ప్రకటన చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యూజర్లు వరల్డ్ కప్-2024 మ్యాచ్‌లను అన్నింటినీ ఫ్రీగా చూడొచ్చని తెలిపింది. కాగా.. గతంలో ఆసియా వన్డే కప్-2023, వన్డే వరల్డ్ కప్-2023 మ్యాచ్‌లను కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచితంగానే వీక్షించే అవకాశం కల్పించింది. తాజాగా టీ20 వరల్డ్ కప్-2024 కూడా ఫ్రీగా చూసేందుకు అవకాశం ఇవ్వడంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ఐర్లాండ్‌తో జూన్ 5న జరగనుంది. అందరూ ఎంతగానో ఎదురుచూసే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జూన్ 9వ తేదీన జరగనుంది. మరోవైపు ఈనెలలో ప్రారంభం అవుతున్న ఐపీఎల్ సీజన్ మ్యాచ్‌లు జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక జియో సినిమా కూడా ఉచితంగానే మ్యాచ్‌లు చూసేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.