ఏడో నెంబర్ జెర్సీ ఎంత ప్రత్యేకమో చెప్పిన ఎంఎస్ ధోనీ
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 9:07 AM GMTఏడో నెంబర్ జెర్సీ ఎంత ప్రత్యేకమో చెప్పిన ఎంఎస్ ధోనీ
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన కెప్టెన్సీకి.. వికెట్ కీపింగ్‌కు.. అలాగే బ్యాటింగ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆయన ప్రస్తుతం టీమిండియా తరఫున ఆడకపోయినా.. ఐపీఎల్‌లో మాత్రం ఆడుతున్నారు. దాంతో.. ఆయన బ్యాటింగ్ చూసేందుకు గత ఐపీఎల్‌లో జనాలు పెద్ద ఎత్తున వచ్చేవారు. ధోనీ ఎప్పుడు బ్యాటింగ్ చేస్తారా అని ఎదురుచూశారు. అంతేకాదు.. ధోనీ ఎక్కడైనా బయట కనిపిస్తే చాలు ఒక్క సెల్ఫీ కోసం ఎగబడుతుంటారు. అంటి ఫ్యాన్ బేస్ ఉంది. టీమిండియా ఆటగాళ్లతో పాటు.. ఇతర టీముల ఆటగాళ్లు కూడా ధోనీని ఫాలో అవుతుంటారు.
అయితే.. ఎంఎస్ ధోనీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జెర్సీ నెంబర్ 7తో తనకు ఎంతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. టీమిండియాలో సెలెక్ట్ అయినప్పుడు సెవెన్ నెంబర్‌ను ఎందుకు ఎంచుకున్నారనే విషయాన్ని చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ ధోనీ.. యాంకర్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పారు. జెర్సీ నెంబర్ సెవెన్ గురించి అడిగిన ప్రశ్నలకు.. ఆ నెంబర్ అంటే ఎందుకు మీకంత ప్రత్యేకమని అడిగారు. అదే సమయంలో ఇంటికి రావాలని మీ తల్లిదండ్రులు కోరుకునేవారా అని అడగ్గా.. లేదు.. తనని ఆ తేదీనే కనాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారని ధోనీ చెప్పారు. తాను జులై 7వ తేదీ 1981లో జన్మించానని అన్నారు. జులై అటే ఏడో నెల.. అలాగే 81వ సంవత్సరం..8-1 అది కూడా ఏడో నెంబరే అని చెప్పారు. అందుకే ఏడో నెంబర్ తనకెంతో ప్రత్యేకమన్నారు. ఇక టీమిండియా సెలెక్టర్లు కూడా ఏ జెర్సీ నంబర్ కావాలని అడిగితే.. ఏడో నెంబర్ ఎంచుకోవడం సులభం అయ్యిందని ఎంఎస్ ధోనీ చెప్పాడు.
ఇక ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో మాత్రమే ఆడుతున్న ఎంఎస్ ధోనీ.. గత సీజన్ విజేతగా సీఎస్కేను నిలిపాడు. అత్యధిక ట్రోఫీలు గెలిచిన ముంబై రికార్డును ధోనీ సమం చేశాడు. ఇక త్వరలోనే మరో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది. దాని కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.