గ్లెన్ మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచరీ.. రోహిత్‌శర్మ రికార్డు సమం
ఆడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 5:29 PM ISTగ్లెన్ మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచరీ.. రోహిత్‌శర్మ రికార్డు సమం
ఆడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా రెండో టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 55 బంతుల్లో వంద పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 8 సిక్స్‌లు, 12 ఫోర్లు ఉన్నాయి. ఈ శతకం మ్యాక్స్‌వెల్‌కు టీ20ల్లో సెంచరీ అయ్యింది. అయితే.. పొట్టి క్రికెట్‌లో ఇప్పటి వరకు ఐదు సెంచరీలు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరు మీద ఉండగా.. దాన్ని గ్లెన్ మ్యాక్స్ వెల్ సమం చేశాడు.
టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు:
రోహిత్ శర్మ - 5 సెంచరీలు (143 ఇన్నింగ్స్)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ - 5 సెంచరీలు (94 ఇన్నింగ్స్)
సూర్యకుమార్ యాదవ్- 4 సెంచరీలు (57 ఇన్నింగ్స్)
బాబర్ ఆజం- 3 సెంచరీలు (103 ఇన్నింగ్స్)
కోలిన్ మన్రో -3 సెంచరీలు (62 ఇన్నింగ్స్ )
వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ శతకంతో రాణించడంతో.. ఆస్ట్రేలియా 241 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ 31 పరుగులు, వార్నర్ 22 పరుగులు, మిచెల్ మార్ష్ 29 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో జోసెఫ్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ 109 మీటర్ల సిక్స్‌ను కొట్టాడు. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. దాంతో.. విండీస్‌పై ఆస్ట్రేలియా 34 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా మూడె టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఇప్పటికే గెలిచింది. ఇక నామమాత్ర మూడో టీ20 మ్యాచ్ ఆడనున్నాయి ఇరు జట్లు.
టీ20 ఫార్మాట్‌లో ఐదు సెంచరీలు చేసిన మ్యాక్స్‌వెల్ మరో అరుదైన రికార్డు కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో ఆస్ట్రేలియా క్రికెటర్లంతా కలిసి చేసినన్ని సెంచరీలు ఒక్క మ్యాక్స్‌వెల్ సాధించాడు. టీ20ల్లో ఆసీస్ ఆటగాళ్లంతా కలిపి ఐదు శతకాలు చేయగా.. మ్యాక్స్‌వెల్ ఒక్కడే సింగిల్ హ్యాండెడ్‌గా ఐదు సెంచరీలు చేశాడు. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా తరఫున మ్యాక్స్‌వెల్ తర్వాత స్థానంలో రెండు సెంచరీలు చేశౄడు ఆరోన్ ఫించ్. ఇక డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, జోష్ ఇంగ్లిండ్ తలో సెంచరీ చేసి ఉన్నారు. కాగా.. టీ20 ఫార్మాట్లో ఆస్ట్రేలియా తరఫున మొత్తం 95 మంది ఆటగాళ్లు ప్రాతినిథ్యం వమించారు. ఇందులో ఐదుగురు మాత్రమే సెంచరీలు చేశారు.
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మ్యాక్స్‌వెల్ సెంచరీలు:
వెస్టిండీస్ Vs 120 పరుగులు (55 బంతుల్లో)
శ్రీలంక Vs 145 పరుగులు (65 బంతుల్లో)
ఇండియా Vs 113 పరుగులు (55 బంతుల్లో)
ఇండియా Vs 104 పరుగులు (48 బంతుల్లో)
ఇంగ్లండ్ Vs 103 పరుగులు (58 బంతుల్లో)