న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కొలిన్ మున్రో శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల మున్రో తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాలో జన్మించిన కోలిన్ మున్రో న్యూజిలాండ్ క్రికెట్ లో తనదైన ఆటతో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.
కోలిన్ మున్రో 2024 T20 ప్రపంచ కప్ న్యూజిలాండ్ జట్టులో చోటు పొందలేదు. దీంతో అతను రిటైర్మెంట్ నిర్ణయించుకున్నాడు. మున్రో తన భావాలను వ్యక్తం చేస్తూ.. "నా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి చాలా సమయం గడిచినప్పటికీ.. నా ఫ్రాంచైజీ T20 ఫామ్ ఆధారంగా తిరిగి పునరాగమనం చేయగలననే ఆశను నేను ఎప్పుడూ వదులుకోలేదని అన్నాడు.
కోలిన్ మున్రో 2012లో దక్షిణాఫ్రికాతో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. అతడు 122 టీ20 మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో వెస్టిండీస్‌పై మౌంట్ మౌంగానుయ్‌లో 47 బంతుల్లో సెంచరీ సాధించాడు, ఇది ఆ సమయంలో న్యూజిలాండ్‌కు వేగవంతమైన T20 సెంచరీ. ఇది కాకుండా T20 అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా కోలిన్ మున్రో చరిత్ర పుటలలో తన పేరును నమోదు చేసుకున్నాడు.
2016లో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో శ్రీలంకపై మన్రో 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్‌కు ఇది వేగవంతమైన హాఫ్ సెంచరీ. ప్రపంచంలో నాల్గవ వేగవంతమైన హాఫ్ సెంచరీ. టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోనప్పటికీ.. న్యూజిలాండ్ క్రికెట్‌కు మున్రో అందించిన సహకారం అభినందనీయం. 2019 ప్రపంచకప్ ఫైనల్‌లో కీలక పాత్ర పోషించాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగుతానని మున్రో స్పష్టం చేశాడు.