కెమెరా ముందే ప్లేయ‌ర్‌కు ప్ర‌పోజ్ చేసిన కోచ్‌

Coach proposes to fencer on live TV.ఓ ప్లేయ‌ర్ లైవ్‌లో టీవీలో మాట్లాడుతుండ‌గా.. ఆమె కోచ్ కెమెరాల సాక్షిగా ప్ర‌పోజ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2021 3:20 PM IST
కెమెరా ముందే ప్లేయ‌ర్‌కు ప్ర‌పోజ్ చేసిన కోచ్‌

ఓ ప్లేయ‌ర్ లైవ్‌లో టీవీలో మాట్లాడుతుండ‌గా.. ఆమె కోచ్ కెమెరాల సాక్షిగా ప్ర‌పోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న టోక్యో ఒలింపిక్స్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే.. అర్జెంటీనా ఫెన్స‌ర్ మారియా బెలెన్ పెరెజ్ మారిస్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని మొదటి రౌండులోనే వెనుదిరిగింది. దీంతో ఓట‌మి బాధ‌లోనే ఆమె ఇంట‌ర్వ్యూ ఇస్తోంది.

ఆమె లైవ్‌లో మాట్లాడుతుండ‌గా.. ఆమె కోచ్ లూకాస్ సాసెడో వెనుక నిలుచోని న‌న్ను పెళ్లి చేసుకుంటావా..? అని రాసిపెట్టుకున్న ఓ ఫ్ల‌కార్టును ప‌ట్టుకుని నిలుచుకున్నాడు. అది గ‌మ‌నించిన మీడియా ప్ర‌తినిధులు న‌వ్వ‌డంతో.. ఆమె వెనుక‌కు తిరిగి చూసి ఆశ్చ‌ర్యపోయింది. చాలా మంది మ‌న‌ల్ని చూస్తున్నారు.. ఎస్ అని చెప్పు అని కోచ్ మోకాలిపై కూర్చొని వేడుకున్నాడు. దీంతో ఆమె వెంట‌నే ఓకే చెప్పేసింది.

ఇదిలా ఉంటే.. అత‌డు ఇలా ప్ర‌పోజ్ చేయ‌డం ఇదే తొలిసారి కాదు.. 2010లో పారిస్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నప్పుడు కూడా సాసేడో ఇలాంటి ప్రయత్నమే చేశాడు. అయితే ఆ సమయంలో మరియా మాత్రం జోక్ చేస్తున్నారా అంటూ ప్రశ్నించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత కోచ్ ప్రపోజల్‌కు మరియా అంగీకారం తెలిపింది. వీరిద్దరూ 17 సంవత్సరాల నుంచి రిలేషన్‌లో ఉన్నారు. కోచ్ చేసిన ప్రపోజల్‌కు స్పందించిన మరియా.. 'నేను ఏం మాట్లాడలేను. ఓ మై గాడ్.. నమ్మకలేకపోతున్నాను. మేం ఈ మధురమైన క్షణాలను అర్జెంటీనాలో సాంప్రదాయబద్దకంగా జరుపుకుంటాం' అని పెరెజ్ మారిస్ చెప్పుకొచ్చింది.

Next Story