ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో తక్కువ ధర పలికిన స్టీవ్ స్మిత్.. ఈ ఏడాది లీగ్‌లో ఆడకపోవచ్చని మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన స్మిత్ రూ. 12 కోట్ల 5 లక్షలు అందుకున్నాడు. అయితే.. టోర్నీలో రాణించకపోవడంతో అతన్ని రాజస్థాన్ రాయల్స్ వదులుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్మిత్‌ను 2 కోట్ల 2 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది. ఈ నేఫథ్యంలో.. రూ. 2 కోట్లు తీసుకుని స్మిత్ ఐపీఎల్‌లో ఆడతాడని తాను అనుకోవడం లేదన్నారు మైఖేల్ క్లార్క్.
ఇదిలావుంటే.. గత కొన్ని సీజన్లుగా విఫలం అవుతున్నప్పటికి ఆస్ట్రేలియాకు చెందిన ఆల్‌రౌండర్ గ్లెన్‌మ్యాక్స్‌వెల్‌కు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. గతసీజన్‌లో పది కోట్లకు పంజాబ్ అతడిని కొనుగోలు చేయగా.. ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో పంజాబ్ అతడిని వదిలివేసింది. రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన మాక్స్‌వెల్ కోసం చెన్నై, ఆర్‌సీబీ పోటీపడ్డాయి. చెన్నై వద్ద తక్కువ మొత్తమే ఉండడంతో.. రూ.14 కోట్ల వరకు ప్రయత్నించి వదిలివేయగా.. ఆర్‌సీబీ మరో 25 లక్షలు జోడించి రూ.14.25కోట్లకు దక్కించుకుంది. దీంతో ఈ ఆస్ట్రేలియా ఆటగాడు మరోసారి జాక్‌పాట్ కొట్టేశాడు.