క్రిస్ గేల్ విధ్వంసం.. మ‌రోమారు విరిగిన బ్యాట్‌..!

క్రిస్ గేల్ ప్రస్తుతం లెజెండ్స్ లీగ్‌లో ఆడుతున్నాడు. గుజరాత్ జెయింట్స్ తరఫున క్రిస్ గేల్ లెజెండ్స్ లీగ్ లో ఆడుతున్నాడు

By Medi Samrat  Published on  22 Nov 2023 9:26 PM IST
క్రిస్ గేల్ విధ్వంసం.. మ‌రోమారు విరిగిన బ్యాట్‌..!

క్రిస్ గేల్ ప్రస్తుతం లెజెండ్స్ లీగ్‌లో ఆడుతున్నాడు. క్రిస్ గేల్ ఈ లీగ్ లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే వ‌య‌సు అయిపోతుంది క‌దా.. ఏం ఆడుతాడులే అనుకుంటే పొర‌పాటే.. ఈ విధ్వంసక వీరుడు టోర్నీలో ఇష్టానుసారంగా బౌండరీలు, సిక్స‌ర్లు బాది బౌలర్లను భయపెడుతున్నాడు.

బుధ‌వారం భిల్వారా కింగ్స్ vs గుజరాత్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా.. గేల్‌.. బౌల‌ర్‌ రియాన్ సైడ్‌బాటమ్ వేసిన‌ బౌన్సర్‌ను ఆఫ్‌సైడ్ మీదుగా ఆడ‌టానికి ప్రయత్నించాడు. అతని షాట్ ప‌వ‌ర్‌కు బ్యాట్ హ్యాండిల్ విరిగిపోయింది. దీంతో మైదానంలో ఉన్న ఆట‌గాళ్ల‌తో పాటు అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయారు.

44 ఏళ్ల వ‌య‌సులో కూడా బౌలర్ల పట్ల క్రూరంగా ప్రవర్తించడానికి ప్రయత్నించిన ఈ పెద్ద మనిషి.. ఇప్పటికీ ఎన్ని బ్యాట్‌ల‌ను ఇలా విర‌గ‌గొడుతాడు అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతూ వీడియోను వైర‌ల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గేల్ 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 52 ప‌రుగులు చేశాడు. గేల్ బ్యాటింగ్ ధాటికి గుజరాత్ జెయింట్స్ 20 ఓవ‌ర్ల‌లో 172 ప‌రుగులు చేసింది. 173 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్ దిగిన‌ భిల్వారా కింగ్స్ ప్ర‌స్తుతం 10 ఓవ‌ర్ల‌కు 3 వికెట్లు కోల్పోయి 80 ప‌రుగులు చేసింది. భిల్వారా కింగ్స్ విజ‌యానికి 60 బంతుల్లో మ‌రో 93 ప‌రుగులు కావాలి.

Next Story