గేల్ తుఫాన్ ఇన్నింగ్స్.. 22 బంతుల్లో 84పరుగులు
Chris Gayle smashes 22 balls unbeaten 84 to steer Team Abu Dhabi to easy win.వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్
By తోట వంశీ కుమార్ Published on 4 Feb 2021 2:58 PM ISTవెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ ఎంతటి విధ్వంసకర ఆటగాడో అందరికి తెలిసిందే. గేల్ ఉన్నాడంటే చాలు ఎంతటి లక్ష్యం అయినా చిన్నబోవాల్సిందే. వయసు మీద పడుతుండడంతో గేల్ నుంచి మెరుపులు తగ్గాయనేది కాదనలేని వాస్తవం. అభిమానులు అంతా ముద్దుగా యూనివర్స్ బాస్ పిలుచునే గేల్ తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని చెబుతున్నాడు. అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో గేల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం గేల్ 22 బంతుల్లో 84 పరుగులు చేశాడు.
బుధవారం రాత్రి మరాఠా అరేబియన్స్, అబుదాబి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన మరాఠా జట్టు నిర్ణీత 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఓపెనర్ అలిషన్ షరాపు(33; 23 బంతుల్లో 2పోర్లు, 3 సిక్సర్లు) పరుగులతో రాణించాడు. అనంతరం లక్ష్య చేదనకు దిగిన అబుదాబి జట్టుకు గేల్ ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. 22 బంతుల్లో 6పోర్లు, 9సిక్సర్లు బాది 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కేవలం 12 బంతుల్లోనే అర్థశతకాన్ని అందుకున్నాడు. దీంతో 98 పరుగుల లక్ష్యాన్ని అబుదాబి జట్టు 5.3ఓవర్లలోనే చేదించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున బరిలోకి దిగిన గేల్ ఓ మోస్తారుగా రాణించాడు. దీంతో 14వ సీజన్ కోసం ఆ జట్టు గేల్‌ను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. గేల్ మెరుపులు చూస్తుంటే.. వయసు పెరుగుతున్నా ఇంకా తనలో బ్యాటింగ్ చేసే సత్తా ఉందని చెప్పకనే చెబుతున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లోనైనా గేల్ మెరుపులను చూడాలని అభిమానులను ఆశిస్తున్నారు.