తండ్రిని కోల్పోయిన యువ క్రికెటర్

Chetan Sakariya father pass away due to Covid-19. చేతన్ సకారియా తండ్రి కరోనా కారణంగా కన్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 9 May 2021 6:02 PM IST

Chetan Sakariya

చేతన్ సకారియా.. ఈ ఏడాది ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఫాస్ట్ బౌలింగ్ తో అదరగొట్టిన ఆటగాడు. అతడి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. చేతన్ సకారియా తండ్రి కరోనా కారణంగా కన్నుమూశారు. చేతన్ సకారియా తండ్రి కాంజీభాయ్ సకారియా కరోనా కారణంగా కన్నుమూశాడు. గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ లో చేతన్ సకారియా తండ్రి కాంజీభాయ్ కరోనాకు చికిత్స తీసుకుంటూ ఉండగా.. ఆదివారం నాడు ఆయన పరిస్థితి విషమించడంతో ప్రాణాలను వదిలాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

చేతన్ సకారియాతో తాము టచ్ లోనే ఉన్నామని.. అతడి కుటుంబానికి అండగా నిలుస్తామని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తెలిపింది. ఇలాంటి కష్ట సమయాల్లో ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. చేతన్ సకారియా ఈ ఏడాది ఐపీఎల్ లో మంచి ప్రదర్శన కనబరిచాడు. తప్పకుండా భవిష్యత్తులో భారత్ కు ఆడతాడని పలువురు క్రికెట్ లెజెండ్స్ అభిప్రాయపడ్డారు. చేతన్ సకారియా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్ ను ఆడే సమయంలో అతడి సోదరుడు మరణించాడు. చేతన్ సకారియా సోదరుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

ఈ వార్త అతడిని కబళించి వేసింది. అతడు టోర్నమెంట్ ఆడిన సమయంలో సోదరుడు మరణించగా.. అతడి కుటుంబం ఈ విషయాన్ని చేతన్ కు చెప్పలేదు. చేతన్ టోర్నమెంట్ ముగించుకుని ఇంటికి వెళ్ళాక అసలు విషయం తెలిపారు. ఇక ఇప్పుడు చేతన్ తన తండ్రిని కూడా కోల్పోయాడు. చేతన్ బయో బబుల్ లో ఐపీఎల్ ఆడుతున్నప్పుడే అతడి తండ్రికి కరోనా సోకిందనే విషయం తెలిసింది. తనకు ఫ్రాంచైజీ ఇచ్చిన డబ్బులను తల్లిదండ్రులకు ట్రాన్స్ ఫర్ కూడా చేసేశాడు. చేతన్ సకారియాను వేలంపాటలో రాజస్థాన్ రాయల్స్ 1.2 కోట్లకు కొనుక్కుంది. అతడు డెత్ బౌలింగ్ మంచిగా చేయగలిగాడు కూడానూ..!


Next Story