చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది.

By Srikanth Gundamalla  Published on  22 Sept 2024 9:00 PM IST
చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఈ పోటీల్లో భారత్‌ తొలిసారిగా స్వర్ణ పతకం గెలుచుకుంది. హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ చెస్‌ ఒలింపియాడ్‌ ఓపెన్ విభాగంలో భారత బృందం పసిడి కాంతులు విరజిమ్మింది. ఆదివారం నల్ల పావులతో ఆడిన గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ ర‌ష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెడోసీవ్‌పై అద్భుత విజ‌యంతో దేశానికి గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ టోర్నీలో గుకేశ్‌తో పాటు అర్జున్ ఎరిగేసి, ఆర్ ప్ర‌జ్ఞానంద‌, విదిత్ గుజ‌రాతీ, పీ హ‌రికృష్ణ‌, శ్రీ‌నాథ్ నారాయ‌ణ‌న్‌లతో కూడిన బృందం అద్భుతంగా రాణించింది.

రెండేండ్ల‌కు ఓ సారి జరిగే ఈ టోర్నీ జరుగుతుంది. గతంలో 2022 ఏడాదిలో కాంస్యంతో స‌రిపెట్టుకున్న భార‌త్‌కు ఈసారి స్వ‌ర్ణం ద‌క్క‌డం దక్కింది. దాంతో.. భారత్‌ రికార్డు సాధించినట్లు అయ్యింది. 2014లోనూ చెస్‌ ఒలింపియాడ్‌లో కంచు మోత మోగించిన విషయం తెలిసిందే.

కాగా.. ఆదివారం జ‌రిగిన ఈ చెస్‌ ఒలింపియాడ్‌ పోటీల్లో గుకేశ్, అర్జున్‌లు స్లోవేనియా ఆట‌గాళ్లకు చెక్ పెట్టారు. చివ‌రి రౌండ్‌లో భార‌త్ 19 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో నిలిచింది. చైనా(17 పాయింట్లు), స్లోవేనియా(16 పాయింట్లు)లు వ‌రుస‌గా రెండు, మూడు స్థానాలు ద‌క్కించుకున్నాయి. మ‌హిళ‌ల విభాగంలో భార‌త్, క‌జ‌కిస్థాన్ జ‌ట్లు 17 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో నిలిచాయి. ఇక అమెరికా, పోలండ్ దేశాలు 16 పాయింట్లు సాధించిడంతో రెండూ కలిసి రెండో స్థానాన్ని పంచుకున్నాయి.

Next Story