ఐపీఎల్ లైవ్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని

Chennai Super Kings opt to bowl. లక్నో సూపర్ జెయింట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

By Medi Samrat  Published on  3 May 2023 3:51 PM IST
ఐపీఎల్ లైవ్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని

లక్నో సూపర్ జెయింట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో లక్నో కెప్టెన్ గా కృనాల్ పాండ్యా వ్యవహరిస్తూ ఉన్నాడు. పాయింట్స్ టేబుల్ లో లక్నో మూడో స్థానంలో ఉండగా.. చెన్నై నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ కు మరింత చేరువ అవుతుంది.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, మనన్ వోహ్రా, కరణ్ శర్మ, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(w), కృనాల్ పాండ్యా(c), కృష్ణప్ప గౌతమ్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోనీ(w/c), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

లక్నో ఇంపాక్ట్ ప్లేయర్స్: యశ్ ఠాకూర్, డేనియల్ సామ్స్, ప్రేరక్ మన్కడ్, దీపక్ హుడా, క్వింటన్ డి కాక్

చెన్నై ఇంపాక్ట్ ప్లేయర్స్: అంబటి రాయుడు, మిట్చెల్ సన్తనేర్, శుబ్రాన్షు సేనాపతి, షైక్ రషీద్, ఆకాశ్ సింగ్


Next Story