శిఖర్ ధావన్ మీద ఛార్జ్ షీట్
Chargesheet filed against Shikhar Dhawan in Varanasi court.టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చేసిన ఓ పని కారణంగా, గురువారం వారణాసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలైంది.
By తోట వంశీ కుమార్
టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చేసిన ఓ పని కారణంగా ఓ బోట్‌మెన్ కష్టాల్లో పడ్డ సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ విజృంభిస్తున్న సమయంలో.. ధావన్ పడవలో విహరిస్తూ పక్షులకు ఆహారం వేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. దీంతో మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. శిఖర్ ధావన్ ఇటీవల వారణాసీ టూర్‌కి వెళ్లాడు. వారణాసిలో గంగా నదిపై పడద మీద వెళ్లిన ధావన్ పక్షులకి ఆహారాన్ని పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బర్డ్ ప్లూ నేపథ్యంలో పక్షులకు ఆహారాన్ని అందించటం తనకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.
ఇప్పుడు ఇదే అతడికి కష్టాలు తెచ్చింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారణాసిలో పర్యాటకులు పక్షులకి ఎలాంటి ఆహరం పెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. పక్షులకు మేత వేయడంపై పర్యాటకులకు అవగాహన ఉండకపోవచ్చు.. బోటు యజమానులు విషయం చెప్పకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అన్నారు. శిఖర్ ధావన్‌పై గురువారం వారణాసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలైంది. దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ధావన్ పక్షులకు ఆహారం వేయడం ఏంటంటూ సిద్దార్థ్ శ్రీవాత్సవ అనే లాయర్ అతనిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
లాయర్ చార్జ్‌షీట్‌తో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ త్రితియా దివాకర్ కుమార్ గురువారం ధావన్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఫిబ్రవరి 6న జరపనున్నట్లు మెజిస్ట్రేట్ తెలిపారు. సరదాగా ఓ బోటులో తిరుగుతూ అక్కడి పక్షులకు ఆహారం వేశాడు ధావన్. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పక్షులకు మేత తినిపించడం ఎంతో సంతోషంగా ఉందంటూ ధావన్ చెప్పాడు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో వారణాసి కలెక్టర్ స్పందించారు. ధావన్ విహరించిన బోటు యజమానిపై చర్యలకు ఆదేశించారు.