ధోని పుట్టిన రోజు వేడుక‌ల‌కు హాజ‌రైన పంత్‌.. వీడియో వైర‌ల్‌

Captain Cool celebrates his birthday with wife Sakshi in UK Rishabh Pant joins the party.టీమ్ఇండియా మాజీ కెప్టెన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 July 2022 6:16 AM GMT
ధోని పుట్టిన రోజు వేడుక‌ల‌కు హాజ‌రైన పంత్‌.. వీడియో వైర‌ల్‌

టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూప‌ర్ కింగ్స్ సార‌ధి మ‌హేంద్ర సింగ్ ధోని నేడు 41వ ప‌డిలో అడుగుపెట్టాడు. ఈ సంద‌ర్భంగా ఈ దిగ్గ‌జ ఆట‌గాడికి అభిమానులు, ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ప్ర‌స్తుతం ధోని బ్రిట‌న్‌లో ఉన్నాడు. జూలై 4న ధోని పెళ్లి రోజు అన్న సంగ‌తి తెలిసిందే. సెలబ్రేషన్స్‌ కోసం ధోని దంప‌తులు లండన్ వెళ్లారు. ఈ క్ర‌మంలో ధోని పుట్టిన రోజును సైతం అక్క‌డే జ‌రుపుకున్నాడు. భార్య సాక్షి, కుమార్తె జీవా, స్నేహితుల సమక్షంలో మ‌హేంద్రుడు కేక్ క‌ట్ చేశాడు.

ధోని సతీమణి సాక్షి.. మ‌హి కేక్‌ కట్‌ చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నారు. 'పుట్టిన రోజు శుభాకాంక్షలు మై లవ్‌' అనే క్యాప్షన్‌ జత చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే 5.90 లక్షలకు పైగా లైకులు ఈ వీడియోకు వ‌చ్చాయి. ధోనీ పుట్టిన రోజు సంబరాలకు టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సైతం హాజరయ్యాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు 15 ఆగ‌స్టు 2020న వీడ్కోలు ప‌లికాడు ధోని. అయితే.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో మాత్రం కొన‌సాగుతున్నాడు. ఇక వ‌చ్చే సీజ‌న్‌లో కూడా ఆడ‌తాన‌ని ధోని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

Next Story