బుమ్రా వచ్చేస్తున్నాడు..ఐర్లాండ్‌తో టీ20 సీరిస్‌లో ఆడనున్న బౌలర్
ఐర్లాండ్‌తో టీమిండియా ఆడనున్న మూడు టీ20 సిరీస్‌ల మ్యాచుల్లో బుమ్రా ఆడనున్నట్లు..
By Srikanth Gundamalla Published on 18 Jun 2023 5:33 PM ISTబుమ్రా వచ్చేస్తున్నాడు..ఐర్లాండ్‌తో టీ20 సీరిస్‌లో ఆడనున్న బౌలర్
భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం కారణంగా చాలా రోజులుగా క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ మధ్యే న్యూజిలాండ్ వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. అయితే.. వెన్నునొప్పి కారణంగా బుమ్రాకు సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అతను స్పీడ్‌గా రికవరీ అవుతున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ అధికారి ఒకరు కీలక ప్రకటన చేశారు. ఐర్లాండ్‌తో టీమిండియా ఆడనున్న మూడు టీ20 సిరీస్‌ల మ్యాచుల్లో బుమ్రా ఆడనున్నట్లు తెలిపారు. అన్ని సవ్యంగా జరిగి పూర్తిగా కోలుకుంటే కచ్చితంగా బుమ్రా ఆడతాడని పేర్కొన్నారు. దీంతో..టీమిండియా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టులో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇరు జట్లు మూడు టీ20 మ్యాచుల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు ఆగస్టు 18, 20, 23వ తేదీల్లో జరగనున్నాయి. సర్జరీ తర్వాత స్పీడ్‌గా రికవరీ అవుతోన్న బుమ్రా.. ఇటీవల ఒక ట్విట్టర్‌లో ఒక పోస్టు కూడా పెట్టారు. తాను రన్నింగ్ చేస్తోన్న వీడియోను షేర్ చేస్తూ...హాలో నేస్తమా.. మనం మళ్లీ కలుస్తాం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అతను ఆ పోస్టు పెట్టిన కొద్దిరోజుల్లోనే ఐర్లాండ్‌తో మ్యాచ్‌లకు ఆడే అవకాశం ఉందనే వార్తలు బయటకు వచ్చాయి.
అయితే.. బుమ్రా గతేడాది నుంచి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అతను మైదానంలోకి దిగి చాలా కాలం అయిపోయింది. బుమ్రా పేసర్‌గా టీమిండియాకు కీలకంగా ఉన్న ప్లేయర్. గాయం కారణంగా గతేడాది ఆసియా కప్‌కు కూడా దూరమయ్యాడు. ఐపీఎల్ సీజన్ 2023 సీజన్‌కి కూడా దూరంగానే ఉన్నాడు. ఐపీఎల్ సమయంలోనే న్యూజిలాండ్‌లో బుమ్రాకు సర్జరీ జరిగింది.
భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాకు బుమ్రా కీలకం కానున్నాడు. ఆలోపు బుమ్రా పూర్తిగా కోలుకుని తిరిగి ఫిట్నెస్ సాధించాలని టీమిండియా ప్రతి అభిమాని కోరుకుంటున్నారు.