బుమ్రా సెల‌వు పెళ్లి కోస‌మేనా..!

Bumrah has taken leave to prepare for marriage.బుమ్రా ఎందుకు ఇన్ని రోజులు సెల‌వు తీసుకున్నాడ‌నే దానిపై ప్ర‌స్తుతం చ‌ర్చ న‌డుస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 March 2021 7:28 AM GMT
Bumrah has taken leave to prepare for marriage

అహ్మ‌దాబాద్ వేదిక‌గా రేప‌టి నుంచి ఇంగ్లాండ్‌తో జ‌రిగే నాలుగో టెస్ట్‌తో పాటు ఐదు టీ20ల‌, మూడువ‌న్డేల సిరీస్‌ల నుంచి భార‌త ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా త‌ప్పుకున్నాడు. బుమ్రా వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే త‌ప్పుకున్నాడ‌ని బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. బుమ్రా ఎందుకు ఇన్ని రోజులు సెల‌వు తీసుకున్నాడ‌నే దానిపై ప్ర‌స్తుతం చ‌ర్చ న‌డుస్తోంది. వర్క్‌లోడ్ కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడని అంతా ఊహించారు. కానీ అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విష‌య‌మై పలు మీడియా సంస్థలు ఆరాతీయగా.. అతని పెళ్లి విషయం వెలుగులోకి వచ్చింది.

బ‌మ్రా త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నాడ‌ట‌. అందుక‌నే ఈ సెల‌వులు తీసుకున్నాడ‌ని అంటున్నారు. బుమ్రా పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవ‌రు..? అనే వివ‌రాలు అయితే.. తెలియ‌రాలేదు కానీ బుమ్రా మాత్రం పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త మాత్రం నిజం అని అంటున్నారు. 'జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు బీసీసీఐకి తెలిపాడు. వివాహ ఏర్పాట్ల కోసం తగిన సమయం కావాలి కాబట్టే జట్టుకు దూరమయ్యాడు' అని బీసీసీఐ వర్గాలు ఓ జాతీయ మీడియాతో తెలిపాయి.

అయితే బుమ్రా పెళ్లి విషయమై ఇప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలుబడలేదు. బుమ్రా లేదా బీసీసీఐ చెపితే గాని అసలు విషయం వెలుగులోకి రాదు. 27 ఏళ్ల బుమ్రా భారత్ తరఫున 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20లు ఆడాడు.
Next Story
Share it