తండ్రైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా

టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తండ్రి అయ్యాడు.

By Srikanth Gundamalla  Published on  4 Sept 2023 12:49 PM IST
Bumrah, Father, Baby Boy,

 తండ్రైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా

టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తండ్రి అయ్యాడు. బుమ్రా భార్య సంజనా గణేశన్ సోమవారం ఉదయం మగ శిశువుకి జన్మనిచ్చింది. దాంతో.. బుమ్రా మగబిడ్డకు తండ్రి అయ్యాడు. అయితే.. బుమ్రా దంపతులకు ఇదే తొలి సంతానం. తనకు మగ బిడ్డ పుట్టినట్లు బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కాగా.. ఆసియా కప్‌ కోసం శ్రీలంక వెళ్లిన బుమ్రా... తన భార్య ప్రసవం నేపథ్యంలో తిరిగి వెనక్కి వచ్చాడు. అయితే.. పాకిస్తాన్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో బుమ్రా బౌలింగ్‌ వేయకుండానే చెరో పాయింట్ లభించింది.

తండ్రి అయిన సందర్భంగా బుమ్రా ట్వీట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు..'మా చిన్న కుటుంబం పెద్దగా మారింది. ఈ ఉదయం మేము మా లిటిల్ బాయ్ అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోకి స్వాగతించాము. ఎంతో సంతోషంగా ఉంది. జీవితంలోని ఈ కొత్త అధ్యాయన్ని ప్రారంభిచేందుకు సిద్దంగా ఉన్నాం.' అని జస్ప్రీత్‌ బుమ్రా ట్విట్టర్‌ (ఎక్స్‌)లో పోస్టు పెట్టారు. అంతేకాదు.. తన కుమారుడి పేరును కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంగద్‌ జస్ప్రీత్‌ బుమ్రా అని పేరు పెట్టినట్లు సమాచారం. తన కుమారడి చేతి పక్కనే బుమ్రా దంపతులు చేతులు ఉంచి తీసిన ఫోటోను షేర్‌ చేశారు.

బుమ్రా తండ్రి అయిన సందర్భంగా నెటిజన్లు బుమ్రా-సంజన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. డెలివరీ కారణంగానే బుమ్రా తిరిగి స్వదేశానికి వచ్చాడు. దీంతో అతడు నేపాల్‌తో జరగనున్న గ్రూపు స్టేజి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడు తిరిగి మళ్లీ సూపర్‌-4 మ్యాచ్‌లకు భారత జట్టుతో కలవనున్నాడు.

Next Story