విలియమ్సన్ ను తీసుకుంటారా లేదా.. అభిమానుల డిమాండ్..!
Bring back KaneWilliamson into playing 11. ప్రపంచం లోనే గొప్ప బ్యాట్సమెన్లలో ఒకరైన విలియమ్సన్ ను తర్వాతి మ్యాచ్ లలో ఆడించకపోతే మరిన్ని పరాజయాలు పలుకరిస్తాయని అభిమానులు అంటూ ఉన్నారు.
By తోట వంశీ కుమార్ Published on 15 April 2021 12:01 PM ISTసన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ లో కూడా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలిచేదే.. కానీ మిడిలార్డర్ వైఫల్యంతో మ్యాచ్ ను బెంగళూరు చేతుల్లోకి ఇచ్చేశారు. విలియమ్సన్ ను తీసుకుని ఉండి ఉంటే సన్ రైజర్స్ తప్పకుండా విజయం సాధించేదని అభిమానులు అంటూ ఉన్నారు. ప్రపంచం లోనే గొప్ప బ్యాట్సమెన్లలో ఒకరైన విలియమ్సన్ ను తర్వాతి మ్యాచ్ లలో ఆడించకపోతే మరిన్ని పరాజయాలు పలుకరిస్తాయని అభిమానులు అంటూ ఉన్నారు.
హైదరాబాద్ 6 పరుగుల తేడాతో ఆర్‌సీబీ చేతిలో ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, సిక్సర్లు), కెప్టెన్ కోహ్లి (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ (3/30), రషీద్ ఖాన్ (2/18) విజృంభించడంతో ఆర్సీబీ ఆఖరి 5 ఓవర్లలో ఎక్కువగా పరుగులు చేయలేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ వార్నర్ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్సర్), మనీశ్ పాండే (39 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఓపెనర్ సాహా (1) మరోసారి విఫలమయ్యాడు.
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పాండే ఆచితూచి ఆడాడు. బెంగళూరు బౌలర్లు షహబాజ్ అహ్మద్ (3/7), హర్షల్ పటేల్ (2/25), సిరాజ్ (2/25) హైదరాబాద్‌ను దెబ్బతీశారు. 17వ ఓవర్ వేయడానికి వచ్చిన షహబాజ్ అహ్మద్ తొలి రెండు బంతులకు బెయిర్‌స్టో (12), మనీశ్ పాండేలను అవుట్ చేశాడు. చివరి బంతికి సమద్ (0)ను డకౌట్ చేశాడు. ఆ ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. 18వ ఓవర్‌లో శంకర్ (3) హర్షల్ పటేల్ ... 19వ ఓవర్‌లో హోల్డర్ (4)ను సిరాజ్ అవుట్ చేయడంతో.. చివరి ఓవర్లో రైజర్స్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా... హర్షల్ వేసిన ఈ ఓవర్లో రషీద్ (17), భువనేశ్వర్ (2 నాటౌట్) తొలి మూడు బంతులకు 8 పరుగులు సాధించారు. అయితే వరుస బంతుల్లో రషీద్, నదీమ్ (0) అవుట్ కావడంతో రైజర్స్ ఓటమి ఖాయమైంది.