అంతర్జాతీయ క్రికెట్‌కు మరో క్రికెటర్ గుడ్ బై
Brendan Taylor announces retirement.అంతర్జాతీయ క్రికెట్‌కు మరో క్రికెటర్ గుడ్ బై చెప్పాడు. జింబాబ్వే
By తోట వంశీ కుమార్ Published on 13 Sep 2021 9:25 AM GMTఅంతర్జాతీయ క్రికెట్‌కు మరో క్రికెటర్ గుడ్ బై చెప్పాడు. జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ టేలర్ రిటైర్‌మెంట్ ప్రకటించేశాడు. సోమవారం ఐర్లాండ్‌తో జరగనున్న మూడో వన్డేనే తనకు చివరి వన్డే అని సోషల్ మీడియా వేదికగా ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ తెలిపారు. 17 సంవత్సరాల తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినట్లు తెలిపారు. జింబాజ్వే జట్టును మెరుగైన స్థితిలో నిలిపేందుకు తన వంతు కృషి చేసినట్లు వెల్లడించాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో జింబాబ్వేకి కెప్టెన్‌గా వ్యవహరించిన టేలర్, వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మొట్టమొదటి జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు.
2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో బ్రెండన్ టేలర్ అడుగుపెట్టాడు. 34 టెస్టుల్లో 6 సెంచరీల సాయంతో 2320 45 టీ20 మ్యాచ్‌ల్లో 118.22 స్ట్రైక్‌రేటుతో ఆరు అర్థశతకాల సాయంతో 934 పరుగులు, వన్డేల్లో 204 మ్యాచ్‌ల్లో 11 శతకాల సాయంతో 6677 పరుగులు సాధించాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు(11) చేసిన ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు. ప్రస్తుతం జింబాజ్వే జట్టు ఐర్లాండ్ పర్యటనలో ఉంది. నేడు ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు టేలర్ ప్రకటించాడు.
You're a legend my friend! Well done on a great career on and off the field!
— AB de Villiers (@ABdeVilliers17) September 13, 2021
ఇక టేలర్ నిర్ణయంపై పలువురు క్రికెటర్లు స్పందించారు. నువ్వో లెజెండ్‌వి మై ఫ్రెండ్.. మైదానంలో అయినా.. బయటనైనా నీకెరీర్ చాలా గొప్పగా సాగింది అంటూ సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.