ఐసీయూలో పుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు..!
Brazil great Pele remains in intensive care.పుట్‌బాల్ దిగ్గజం పీలే ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పెద్దప్రేగులో
By తోట వంశీ కుమార్ Published on
12 Sep 2021 5:03 AM GMT

పుట్‌బాల్ దిగ్గజం పీలే ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పెద్దప్రేగులో కణితి ఉండడంతో దాన్ని ఇటీవల ఆపరేషన్ చేసి విజయవంతంగా తొలగించారు వైద్యులు. అనంతరం ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. కీలక అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన స్పృహాలోనే ఉన్నారని, అందరితో మాట్లాడుతున్నారని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఇక తన ఆరోగ్యం మెరుగుపడుతోందని సోషల్ మీడియా ద్వారా పీలే అభిమానులకు తెలియజేశారు.
బ్రెజిల్ తరుపున ఈ దిగ్గజ ఆటగాడు 92 మ్యాచ్‌లు ఆడి.. 77 గోల్స్ చేశాడు. 1958,1962,1970 ల్లో మూడు సార్లు బ్రెజిల్‌ను పుట్‌బాల్ ఛాంపియన్‌గా నిలిపాడు పీలే. ఇక ఆ దేశం తరుపున అత్యధిక గోల్స్ ఇప్పటికి ఆయన పేరు మీదే ఉంది.
Next Story