భారత్‌కు మరో పతకం ఖాయం.. సెమీస్‌కు చేరిన లవ్లీనా
Boxer Lovlina Borgohain Enters Semi-Final in Tokyo Olympics.టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో
By తోట వంశీ కుమార్ Published on 30 July 2021 4:09 AM GMT
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. బాక్సర్ లవ్లీనా చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన హోరా హోరి పోరులో విజయం సాధించిన లవ్లీనా సెమీస్‌కు దూసుకెళ్లింది. 64-69 కేజీల విభాగంలో చైనీస్ తైపీకి చెందిన చెన్ చిన్‌పై 4-1 తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆమె సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఇండియాకు మరో మెడల్ ఖాయం.సెమీస్‌లో ఒకవేళ లవ్లీనా ఓడినా.. బ్రాంజ్ మెడల్ మాత్రం ఖాయం.
#IND have been assured of their second medal at #Tokyo2020
— #Tokyo2020 for India (@Tokyo2020hi) July 30, 2021
Lovlina Borgohain of #IND outpunches #TPE's Chen Nien-Chin in welterweight category (64-69kg) to advance to the semis 🔥#Tokyo2020 #StrongerTogether #UnitedByEmotion #Boxing @LovlinaBorgohai pic.twitter.com/JyYlNvGLze
లవ్లీనా మూడు రౌండ్లలోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రౌండ్‌లో 3-2 తో ఆధిక్యంలో ఉండగా.. రెండో రౌండ్‌లో మొత్తం ఐదుగురు జడ్జీలు లవ్లీనాకే 10 స్కోరు ఇచ్చారు. ఇక మూడో రౌండ్‌లో నలుగురు లవ్లీనా వైపే మొగ్గారు. దీంతో ఆమె 4-1తో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది.