చెన్నైకి వరుస షాక్‌లు..!
Boult, Milne leave CSK reeling. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో దశ మ్యాచులు దుబాయి వేదికగా కొద్ది సేపటి క్రితం
By Medi Samrat Published on 19 Sep 2021 2:36 PM GMT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో దశ మ్యాచులు దుబాయి వేదికగా కొద్ది సేపటి క్రితం ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచులో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ధోని సేన బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. చెన్నై సూపర్ కింగ్స్‌కి వరుస షాక్‌లు తగిలాయి. తొలి ఓవర్లోనే ఓపెనర్ డుప్లెసిస్ (0) డకౌటయ్యడు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లో ఐదో బంతికి మిల్నేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అనంతరం మిల్నే వేసిన రెండో ఓవర్‌లో మొయిన్ అలీ(0) ఔటయ్యడు. మిల్నే వేసిన రెండో ఓవర్లో మూడో బంతికి సౌరభ్ తివారీకి చిక్కాడు. మరో స్టార్ ఆటగాడు సురేశ్ రైనా (4) ఔటయ్యాడు. బౌల్ట్ వేసిన 2.6 బంతికి రాహుల్ చాహర్‌కి చిక్కాడు. ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై 18/3తో ఉంది. మూడు బంతులు ఎదుర్కొన్న అంబటి రాయుడు రిటైర్డ్ హర్ట్ అవగా.. ప్రస్తుతం క్రీజుల్ రుతురాజ్ గైక్వాడ్(10), ధోనీ(2) క్రీజులో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్‌కు రెండు వికెట్లు, మిల్నేకు ఒక వికెట్ దక్కాయి.