షమీని పెళ్లి చేసుకునేందుకు ఓకే.. కానీ షరతు పెట్టిన నటి

షమీ బౌలింగ్‌కు బాలీవుడ్ హీరోయిన్ పాయ‌ల్ ఘోష్ ఫిదా అయింది.

By Srikanth Gundamalla  Published on  9 Nov 2023 4:33 PM IST
bollywood, actress,  marry, shami,  one condition,

షమీని పెళ్లి చేసుకునేందుకు ఓకే.. కానీ షరతు పెట్టిన నటి

వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీ భారత్‌ గడ్డపై కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేని టీమ్‌గా నిలించింది భారత్. అయితే.. టీమిండియాలో బ్యాటర్లు.. బౌలర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ సంచలనంగా మారాడు. మొదటి నాలుగు మ్యాచ్‌లకు అతను దూరంగా ఉన్నా.. ఆ తర్వాత వచ్చిన చాన్స్‌తో ఇరగొట్టేశాడు. తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పటి వరకు వన్డే వరల్డ్‌ కప్‌లో 4 మ్యాచ్‌లు ఆడి మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు.. వరల్డ్‌ కప్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా తన పేరును లిఖించుకున్నాడు. ఇంతకు ముందు వున్న ఫాస్ట్ బౌలర్లు జవగల్ శ్రీనాథ్ , జహీర్ ఖాన్ లను షమీ ఇప్పుడు దాటిపోయాడు. ఇంతకు ముందు 44 వికెట్లు తీసుకొని జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ లు అగ్రస్థానంలో ఉండేవారు. షమీ కేవలం 14 మ్యాచులు ఆది ఈ 45 వికెట్లు తీసుకున్నాడు.

షమీ బౌలింగ్‌కు బాలీవుడ్ హీరోయిన్ పాయ‌ల్ ఘోష్ ఫిదా అయింది. పేస‌ర్‌ను అభినందించ‌డంతోనే ఆగ‌కుండా అత‌డిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది. మంచు మనోజ్‌తో ప్రయాణం సినిమాలో హీరోయిన్‌గా నటించింది పాయల్‌ ఘోష్. ఈమె ప్రస్తుతం ఈమె ఎక్కువగా సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. మంచు మనోజ్‌ తర్వాత తెలుగు, బాలీవుడ్‌లోనూ కొన్ని అవకాశాలు వచ్చాయి. ప‌టేల్ కీ పంజాబీ షాదీ, కోయ్ జానే నా వంటి సిన‌మాల్లో మెరిసింది. ప్రస్తుతం రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న పాయ‌ల్‌.. ర‌మాదాస్ అథ‌వాలేకు చెందిన రాజ‌కీయ పార్టీకి వైస్ ప్రెసిడెంట్‌. తాజాగా పాయల్‌ ఘోష్‌ షమీ గురించి ట్వీట్‌ చేసి ట్రెండ్‌లోకి వచ్చారు.

పాయల్‌ ఘోష్ ఎక్స్‌ వేదికగా షమీని పెళ్లి చేసుకుంటాను అంటూ ఒక పోస్టు పెట్టింది. అంతేకాదు.. ఒక షరతు కూడా పెట్టింది. షమీ ఇంగ్లీష్‌ బాగా నేర్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ట్వీట్‌పై మహ్మద్‌ షమీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. దీని మీద నెటిజన్స్ విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక ష‌మీ 2014లో హ‌సిన్ జ‌హ‌న్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ఇద్ద‌రి మ‌ధ్య మ‌నస్ఫ‌ర్థ‌లు రావ‌డంతో విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. ప్ర‌స్తుతం వీళ్ల విడాకుల‌ కేసు కోర్టులో ఉన్న విష‌యం తెలిసిందే.

Next Story