క్రికెటర్ పృథ్వీ షాపై దాడి కేసులో న‌టి స్వప్నా గిల్ అరెస్ట్‌

Bhojpuri actress Sapna Gill arrested for attacking cricketer Prithvi Shaw. టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై దాడి చేసిన యాక్టర్ స్వప్నా గిల్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat
Published on : 17 Feb 2023 5:18 PM IST

క్రికెటర్ పృథ్వీ షాపై దాడి కేసులో న‌టి స్వప్నా గిల్ అరెస్ట్‌

టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై దాడి చేసిన యాక్టర్ స్వప్నా గిల్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ముంబైలో ఉంటూ పలు భోజ్ పురీ సినిమాల్లో నటించింది. బుధవారం సాయంత్రం పృథ్వీ షా అతని స్నేహితుడు ఆశిష్ సురేంద్రతో కలిసి శాంతాక్రూజ్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు డిన్నర్ కు వెళ్లాడు. అదే సమయంలో కొందరు సెల్ఫీ కోసం పృథ్వీ షా వద్దకు వచ్చారు. అభిమానుల మాటను కాదనలేకపోయిన షా వారిలో ఇద్దరితో సెల్ఫీలు దిగాడు. మరికొందరు వచ్చి సెల్ఫీ అడగటం, అందుకు అతడు అంగీకరించకపోవడంతో గొడవ మొదలైంది. ఈ లోపు పక్కనే ఉన్న పృథ్వీషా స్నేహితుడు హోటల్‌ సిబ్బందికి జరుగుతున్న విషయాన్ని చెప్పగా.. సిబ్బంది నిందితులను హోటల్‌ బయటకు గెంటేశారు. దీంతో నిందితులు పార్కింగ్ ప్లేస్ కు వచ్చి.. షా ప్రయాణిస్తున్న​ బీఎండబ్ల్యూ కారుపై బేస్‌బాల్‌ బ్యాట్లతో దాడికి దిగారు. తప్పించుకున్న షా నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సప్నా గిల్ రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్ వంటి భోజ్ పురీ ఇండస్ట్రీ సూపర్ స్టార్స్‌తో కలిసి పని చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల మందికి పైగా ఫాలోయింగ్ ఉన్న సప్నా, చండీగఢ్‌కు చెందిన మహిళ. ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పలు కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తుంది.


Next Story