విండీస్-లంక చివరి వన్డేకు అనుకోని అతిథులు.!

Bees Halt Play During Third Odi Between West Indies And Srilanka. విండీస్ బౌలర్ అండర్సన్ ఫిలిప్ బౌలింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా తెనేటీగల గుంపు మైదానాన్ని చుట్టుముట్టింది.

By Medi Samrat  Published on  15 March 2021 11:48 AM GMT
West Indies And Srilanka

వెస్టిండీస్-శ్రీలంక మధ్య సోమవారం జరిగిన మూడో వన్డేలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. లంక ఇన్నింగ్స్ 38వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. విండీస్ బౌలర్ అండర్సన్ ఫిలిప్ బౌలింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా తెనేటీగల గుంపు మైదానాన్ని చుట్టుముట్టింది. గమనించిన ఆటగాళ్లు, అంపైర్లు.. వాటి నుంచి రక్షణ కోసం ఫీల్డ్ పై పడుకున్నారు. కాసేపటికి ఆ గుంపు.. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ సంగతికి వస్తే..టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్.. 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.

ఇలా తెనేటీగలు ఆటకు అంతరాయం కలిగించడం ఇదే తొలిసారి కాదు. 2019 వరల్డ్ క‌ప్‌ సందర్భంగా సౌతాఫ్రికా-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. కాసేపటి తర్వాత ఆట మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు.. 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ జట్టులో హసనరంగ (60 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్‌లతో 80), బంద్రా (55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో హుస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. అల్జారీ జోసఫ్, జేసన్ మహ్మద్ తలో వికెట్ తీశారు.

ఇక బ్యాటింగ్ కు దిగిన పొలార్డ్ సేన 48.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. డారెన్ బ్రేవో సెంచరీతో ఆకట్టుకోగా.. షై హోప్, కీరన్ పొలార్డ్ అర్థ సెంచరీలతో రాణించారు. మూడు మ్యాచ్ ల‌ వన్డే సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్‌ చేసింది.




Next Story