ఆసియా కప్ ట్రోఫీని భారత్ కు అప్పగించాలని ఆదేశిస్తూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మోహ్సిన్ నఖ్వీకి అధికారిక ఈమెయిల్ రాసింది. BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ.. నఖ్వీ నుండి ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నామని, అతని వైపు నుండి సరైన సమాధానం రాకపోతే అధికారిక మెయిల్ ద్వారా ఈ విషయాన్ని ICCకి తెలియజేస్తామని హెచ్చరించారు. తాము దశలవారీగా ముందుకు వెళ్తున్నామని, ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆయన తెలిపారు.
పాకిస్థాన్ తో ఆసియా కప్ ఫైనల్ తర్వాత జరిగిన ప్రజెంటేషన్‌లో భారత జట్టు నఖ్వీ నుండి ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించడంతో ఆసియా కప్ ప్రస్తుతం దుబాయ్‌లోని ACC కార్యాలయంలోనే ఉంది. ఈ తరహా ప్రవర్తనపై శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుల నుండి BCCIకి మద్దతు కూడా లభించింది. అయితే BCCI నుండి ఎవరైనా దుబాయ్‌కి వచ్చి తన నుండి ట్రోఫీని తీసుకోవాలని నఖ్వీ చెబుతున్నాడు.