ఐపీఎల్ 2021.. యూఏఈలో మిగిలిన‌ మ్యాచ్‌లు

BCCI To Conduct Remaining Matches Of VIVO IPL In UAE.క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2021

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2021 8:43 AM GMT
ఐపీఎల్ 2021.. యూఏఈలో మిగిలిన‌ మ్యాచ్‌లు

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2021 సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆట‌గాళ్ల‌కు క‌రోనా మ‌హ‌మ్మారి రావ‌డంతో స‌గం సీజ‌న్ ముగిసిన త‌రువాత ఐపీఎల్‌ను వాయిదా వేశారు. మిగిలిన స‌గం సీజ‌న్‌ను యూఏఈ (యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌) లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శ‌నివారం వెల్ల‌డించింది. సెప్టెంబ‌ర్‌-అక్టోబ‌ర్ లో ఇండియాలో వార్షాకాలం ఉంటుంద‌ని.. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మిగితా ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను యూఏఈలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగిన స్పెష‌ల్ జ‌న‌ర‌ల్ మీటింగ్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లు జరగనున్నట్లు తెలుస్తోంది. గతేడాది నిర్వహించిన వేదికల్లోనే మిగిలిన 31 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. దుబాయ్‌, అబుదాబీ, షార్జా స్టేడియంలలో బయోబబుల్ వాతావరణంలో లీగ్‌ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. మరికొద్ది రోజుల్లో లీగ్, ప్లేఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్‌ను ప్రకటించనున్న‌ట్లు చెప్పారు. మిగిలిన సీజ‌న్‌కు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు దూరం కానున్నారు. ఇక 2021 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు భార‌త్ అతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ టోర్నీని కూడా యూఏఈ వేదిక‌గా నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌నే వార్తలు వినిపించాయి. అయితే.. ఈ వ‌ర‌ల్డ్ టోర్నీ విష‌యంలో ఇంకా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. మ‌రింత అద‌న‌పు స‌మ‌యాన్ని ఐసీసీని కోరేందుకు బీసీసీఐ నిర్ణ‌యించిన‌ట్లు ఓ ప్ర‌ట‌క‌న‌లో తెలిపారు.




Next Story