భారత క్రికెట్ జట్టులో "స్టార్ కల్చర్" ఊహించని విధంగా ఉందని, దానికి ఎండ్ కార్డు పెట్టాల్సిన అవసరం ఉందని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శించారు. ఈ స్టార్ కల్చర్ భారత క్రికెట్ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ 1-3 తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆటగాళ్ళు ఆట పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని, BCCI ఆటగాళ్ల జవాబుదారీతనాన్ని తీసుకుని రావడం కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భారత క్రికెట్‌ను మంచిగా, నిజాయితీగా చూసుకోవడానికి రాబోయే 8-10 రోజులు చాలా కీలకమని నేను భావిస్తున్నాను. మరీ ముఖ్యంగా స్టార్ కల్చర్ అంతం కావాలన్నారు. నిజమైన మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఆటగాళ్ళను ప్రతిసారీ అందుబాటులో ఉంచుకోవాలి, ఎవరైనా నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే, వారిని జట్టులో ఎంపిక కోసం పరిగణించకూడదని గవాస్కర్ సూచించారు.