బెంగళూరులోని ఎన్‌సీఎఏలో ప్రస్తుతం పునరావాసం పొందుతున్న ఐదుగురు టీమిండియా ఆటగాళ్ల మెడికల్, ఫిట్‌నెస్ అప్‌డేట్‌లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) విడుదల చేసింది. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినట్లు బీసీసీఐ తెలిపింది. రిషబ్ పంత్ కూడా చాలా మెరుగుపడి ఇండోర్‌లో బ్యాటింగ్ ప్రారంభించాడు.
జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ పునరావాసం చివరి దశలో ఉన్నారు. నెట్స్‌లో పూర్తి స్వింగ్‌లో బౌలింగ్ చేస్తున్నారని బీసీసీఐ తెలిపింది. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు తమ పునరావాసం చివరి దశలో ఉన్నారని, నెట్స్‌లో పూర్తి ఉత్సాహంతో బౌలింగ్ చేస్తున్నారు’’ అని బీసీసీఐ పేర్కొంది. ఇద్దరు ఆటగాళ్లు ఎన్‌సీఏ నిర్వహించే కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లలో పాల్గొంటారు. ఆటగాళ్ల పురోగతిపై బీసీసీఐ వైద్య బృందం సంతోషం వ్యక్తం చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్ తర్వాత తుది తీర్పును ఇవ్వనుంది.
కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌ల ఫిట్‌నెస్‌పై కూడా బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది. ఇద్దరు బ్యాట్స్‌మెన్ నెట్స్‌లో బ్యాటింగ్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఫిట్‌నెస్ కసరత్తులు చేస్తున్నారని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. వీరి పిట్‌నెస్ పురోగతిపై బీసీసీఐ వైద్య బృందం సంతృప్తిగా ఉంది. రాబోయే రోజుల్లో వారి ఫామ్ అందుకోవడం, పిట్‌నెస్ మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
రిషబ్ పంత్‌పై బీసీసీఐ ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది. “రిషబ్ పంత్ తన పునరావాసంలో చాలా పురోగతి సాధించాడు. నెట్స్‌లో బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ప్రస్తుతం తన కోసం రూపొందించిన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను ఫాలో అవుతున్నాడని పేర్కొంది.
ఈ ఐదుగురు ఆటగాళ్లు ప్రపంచ కప్ 2023లో చోటు కోసం పోటీపడుతున్నారు. మేజర్ టోర్నమెంట్‌కు ముందు ఫిట్‌గా ఉండటానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఐర్లాండ్ పర్యటనకు జస్ప్రీత్ బుమ్రాతో పాటు, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో చోటు దక్కించుకుంటారని భావిస్తున్నారు.