బీసీసీఐకి షాక్ ఇచ్చిన గౌతమ్ గంభీర్..!
బీసీసీఐకి టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
By Srikanth Gundamalla Published on 30 May 2024 8:45 AM ISTబీసీసీఐకి షాక్ ఇచ్చిన గౌతమ్ గంభీర్..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షాక్ ఇచ్చినట్లు సమాచారం. బీసీసీఐ ఇప్పటికే టీమిండియా హెడ్ కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించిన విసయం తెలిసిందే. మరోవైపు గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఉంటే బాగుంటుందని క్రికెట్ వర్గాల నుంచి అభిప్రాయాలు వచ్చాయి. దాంతో.. జైషా కూడా ఈ ఆఫర్‌ను గంభీర్‌కు ఇవ్వగా అతను తిరస్కరించినట్లు తెలుస్తోంది. టీమిండియా తదుపరి హెడ్‌కోచ్‌గా గంభీర్‌ను నియమిస్తారని మంగళవారం జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. చివరకు ఇదంతా ప్రచారం మాత్రమే అని తెలిసిపోయింది.
తాజాగా గౌతమ్ గంభీర్ ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గానే తాను మున్ముందు కొనసాగుతానని చెప్పాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌ను సక్సెస్ ఫుల్ టీమ్‌గా నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పాడు. కేకేఆర్ సక్సెస్ ప్రయాణం ఇప్పుడే మొదలు అయ్యిందని చెప్పాడు. సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలిపేందుకు తాము మరో మూడు టైటిళ్లు గెలవాల్సి ఉందని గౌతమ్ గంభీర్ చెప్పాడు. ముంబై, చెన్నై టీమ్‌లకు తమ కంటే రెండు కప్‌లు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. 2024 సీజన్‌లో గెలుపుతో సంతృప్తిగానే ఉన్నానని చెప్పాడు. కానీ ఇంకా బెస్ట్ అని నిరూపించుకోవాలని అనుకుంటున్నట్లు గంబీర్ చెప్పాడు. అలా జరగాలంటే మరోమూడు టైటిళ్లను గెలవాలని గంభీర్ చెప్పుకొచ్చాడు.
తాజాగా గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్స్‌తో అతను టీమిండియా హెడ్ కోచ్ పదవి తీసుకునేందుకు ఆసక్తిగా లేనట్లు అర్థమైంది. టీమిండియా హెడ్ కోచ్‌గా ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. ఆయన పదవి కాలం ఈ టీ20 వరల్డ్ కప్ తర్వాత ముగియనుంది. ఆ తర్వాత ఎవరిని హెడ్‌కోచ్‌గా బీసీసీఐ ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.