కోహ్లీ, రోహిత్, బుమ్రా బీసీసీఐ నుండి ఏడాదికి ఎంత అందుకుంటారంటే..!
BCCI central contracts. భారతజట్టు ఆటగాళ్లకు కూడా బీసీసీఐ నుండి పెద్ద మొత్తంలో జీతాలు వస్తూ ఉంటాయి.
By Medi Samrat Published on 16 April 2021 7:37 AM GMTభారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతజట్టు ఆటగాళ్లకు కూడా బీసీసీఐ నుండి పెద్ద మొత్తంలో జీతాలు వస్తూ ఉంటాయి. బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కించుకుంటే ప్రతీ ఏడాది భారీ మొత్తంలో ఆటగాళ్లకు డబ్బు వస్తాయి. తాజాగా బీసీసీఐ 2020–2021 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. 2019–2020 కాంట్రాక్ట్ గతేడాది సెప్టెంబరు 30తో ముగియగా, తాజా కాంట్రాక్ట్ 2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు ఉంటుంది. మొత్తం 28 మంది ఆటగాళ్లు బీసీసీఐ కాంట్రాక్ట్ ను సొంతం చేసుకున్నారు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గ్రేడ్ 'ఎ' ప్లస్'లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ ముగ్గురికి ఏడాది కాలానికి రూ. 7 కోట్లు చొప్పున చెల్లిస్తారు. వీరు వరుసగా మూడో ఏడాది ఎ ప్లస్ లోనే ఉన్నారు. గత ఏడాది గ్రేడ్ 'సి' కాంట్రాక్ట్ పొందిన కేదార్ జాదవ్ (మహారాష్ట్ర), మనీశ్ పాండే (కర్ణాటక) లు కాంట్రాక్టును కోల్పోయారు. హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, పంజాబ్ బ్యాట్స్‌మన్ శుబ్‌మన్ గిల్ తొలిసారి కాంట్రాక్ట్‌లను అందుకున్నారు. వీరిద్దరికి గ్రేడ్ 'సి' లో చోటు కల్పించారు. వీరిద్దరికి రూ. కోటి చొప్పు న కాంట్రాక్ట్ మొత్తం లభిస్తుంది. 2017–2018 తర్వాత స్పిన్నర్ అక్షర్ పటేల్ (గుజరాత్) మళ్లీ కాంట్రాక్ట్ జాబితాలో చోటు సంపాదించాడు. అక్షర్ పటేల్‌కు గ్రేడ్ 'సి'లో స్థానం ఇచ్చారు. భువనేశ్వర్ కుమార్ గ్రేడ్ 'ఎ' నుంచి 'బి'కి పడిపోయాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గ్రేడ్ 'బి' నుంచి 'ఎ'కు... పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్‌కు గ్రేడ్ 'సి' నుంచి 'బి'కి ప్రమోషన్ లభించింది. గత ఏడాది గ్రేడ్ 'ఎ'లో ఉన్న కుల్దీప్ యాదవ్ గ్రేడ్ 'సి'కి... గ్రేడ్ 'బి'లో ఉన్న యజువేంద్ర చహల్ గ్రేడ్ 'సి'కి పడిపోయారు.
గ్రేడ్ 'ఎ' ప్లస్ (రూ. 7 కోట్లు)
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా.
గ్రేడ్ 'ఎ' (రూ. 5 కోట్లు)
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా.
గ్రేడ్ 'బి' (రూ. 3 కోట్లు)
వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్