వన్డే సిరీస్‌కు రోహిత్ దూరం.. కెప్టెన్‌గా రాహుల్
BCCI announces India's 18 member squad for ODI series.టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు అదృష్టం కలిసి వచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 1 Jan 2022 3:59 AM GMTటీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు అదృష్టం కలిసి వచ్చింది. దక్షిణాఫ్రికాతో జనవరి 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. పేసర్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ(భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేయలేదు. మహ్మద్ షమికి విశ్రాంతి ఇచ్చారు. ఐపీఎల్ 2021 అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్‌లతో పాటు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు చోటు దక్కించుకున్నారు. జనవరి 19న పార్ల్‌లో తొలి వన్డే.. 21, 23 తేదీల్లో కేప్‌టౌన్‌లో రెండు, మూడు వన్డే లు జరగనున్నాయి.
టీమ్ఇండియా వన్డే జట్టు : కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), చహల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్