ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2022.. భార‌త జ‌ట్టు ఎంపిక‌

BCCI Announces Indian Squad for ICC Women's World Cup 2022.మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వ‌ర‌కు న్యూజిలాండ్ వేదిక‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2022 5:43 AM GMT
ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2022..  భార‌త జ‌ట్టు ఎంపిక‌

మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వ‌ర‌కు న్యూజిలాండ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కోసం భార‌త మ‌హిళాల క్రికెట్ జ‌ట్టును బీసీసీఐ(భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు) ప్ర‌క‌టించింది. మిథాలీ రాజ్ సార‌థ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ ను ఎంపిక చేయ‌లేదు. ఇటీవల ఇంగ్లాండ్‌లోని హండ్రెడ్, ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల బిగ్ బాష్ లీగ్‌లలో రోడిగ్స్ అద్భుతంగా ఆడింది. ఆమెను ఎంపిక చేయ‌క‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

వ‌న్డే ప్రపంచ కప్ కు భారత జట్టు ఇదే..

మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (కీపర్) ), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.

స్టాండ్‌బై ప్లేయర్స్: సబ్బినెనే మేఘనా, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్

కివీస్‌తో టీ20 మ్యాచ్‌కు హ‌ర్మ‌న్ ప్రీత్ సార‌థ్యంలో జ‌ట్టును ఎంపిక చేశారు.

టీ20 మ్యాచ్‌కి భారత జట్టు ఇదే..

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (కీపర్), రాజేశ్వరి గైక్వాడ్ , పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, ఎస్ మేఘన, సిమ్రాన్ దిల్ బహదూర్.

Next Story
Share it