బీసీసీఐ మహిళా క్రికెటర్లకు కాంట్రాక్టులను ప్రకటించింది. మూడు గ్రేడ్లలో 17 మందికి అవకాశం కల్పించింది. ‘ఏ’ గ్రేడ్ లో ముగ్గురికి మాత్రమే చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆల్ రైండర్ దీప్తి శర్మకు ‘ఏ’ గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. గ్రేడ్ ‘బీ’ కాంట్రాక్టు ఐదుగురికి దక్కింది. పేసర్ రేణుకా సింగ్, బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, స్పిన్నర్ రాజేశ్వర్ గైక్వాడ్ గ్రేడ్ ‘బీ’ లో ఉన్నారు. గ్రేడ్ ‘సీ’లో 9 మంది ఉన్నారు. సబ్బినేని మేఘన, అంజలి సర్వాని, మేఘనా సింగ్, దేవికా వైద్య, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యస్తికా భాటియా ఉన్నారు.
గ్రేడ్ ‘ఏ’ ప్లేయర్లకు ఏడాదికి రూ.50 లక్షలు చెల్లిస్తారు. గ్రేడ్ ‘బీ’లో ఉన్న వారికి రూ.30 లక్షలు దక్కుతుంది. గ్రేడ్ ‘సీ’ ప్లేయర్లకు రూ.10 లక్షల చొప్పున వార్షిక వేతనంగా చెల్లిస్తూ ఉంటారు. ఈ ఏడాది నుండి వారి వేతనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రేడ్ A అనేది మహిళా క్రికెటర్లకు అత్యధికంగా చెల్లించే కాంట్రాక్ట్. గత ఏడాది పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన వేతనాన్ని బీసీసీఐ ప్రకటించింది. కాంట్రాక్ట్ దక్కిన ఆటగాళ్ల లిస్ట్ ను 17 మందికి పరిమితం చేసింది.