ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2021 వేలానికి అంతా సిద్దమైంది. వేలంలో పాల్గొనేందుకు 1,114 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. వారిలోంచి ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మంది క్రికెటర్లతో కూడిన తుది జాబిజాతను బీసీసీఐ(భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) ప్రకటించింది. ఇటీవలే నిషేదం పూర్తి చేసుకుని వచ్చిన సీనియర్ ఆటగాడు శ్రీశాంత్‌కు చోటు దక్కలేదు. అయితే.. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు మాత్రం అవకాశం దక్కింది. ఈ 292 మంది ఆటగాళ్లలో వేలంలో 61 మందిని మాత్రమే ప్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి.
అత్యధికంగా బెంగళూరు జట్టు 13 మంది కొనుగోలు చేసే అవకాశం ఉండగా.. అత్యల్పంగా సన్‌రైజర్స్ జట్టులో ముగ్గురిని మాత్రమే ఎంచుకునే వీలు ఉంది. సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, స్మిత్, మ్యాక్స్‌వెల్ లు కనిస ధర రూ.2కోట్ల జాబితాలో ఉన్నారు. ఇక వేలంలో అందరి దృష్టి సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌పైనే పడింది. అతడు కనీసం ధర రూ.20లక్షలతో వేలంలో అందుబాటులో ఉన్నాడు. ఏ ఫ్రాంచైజీ అతడిని తీసుకుంటుందో అనే దానిపైనే అందరి ఆసక్తి కలిగి ఉంది.
గురువారంతో ట్రేడింగ్ విండోలో కూడా ముగియడంతో.. బీసీసీఐ తుది జాబితాను విడుదల చేసింది. ఈ నెల 18న చెన్నైలో ఐపీఎల్ వేలం జరగనుంది. కరోనా కారణంగా గతేడాది యూఏఈలో నిర్వహించగా.. ఈ సారి మాత్రం భారత్‌లోనే నిర్వహించనున్నారు. ఈ సీజన్ షెడ్యూల్‌పై బోర్డు కసరత్తులు ప్రారంభించింది. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 11న ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్ జరగనుందని తెలుస్తోంది.